స్పెయిన్ లో సామ్ మంటలు

0

సౌత్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్లలో సమంతా ఒకరు. అంతే కాదు పెళ్ళిచేసుకున్న తర్వాత హీరోయిన్ కెరీర్ ను కొనసాగిస్తూ హిట్లు సాధించిన ఘనత కూడా సమంతా సొంతం. ఆ విషయంలో ఓ రకంగా ట్రెండ్ సృష్టించింది సామ్. ఇక గ్లామర్ ట్రీట్స్ అంటారా? కొందరు అభిమానులు.. కొందరు సంస్కారి నెటిజన్లు ఎప్పుడూ సమంతాకు సుద్దులు చెప్తుంటారు కానీ వాటిని సమంతా తన చెవికి ఎక్కించుకోదు. తనకు కాని కాస్త తిక్కరేగిందంటే డబల్ డోస్ గ్లామర్ తో కొత్త ఫోటో షూట్ చేసి విమర్శకులకు సమాధానం ఇస్తుంది.

ప్రస్తుతం సమంతా తన స్వీట్ హబ్బీ నాగచైతన్య.. మరిది అఖిల్.. ఇతర ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలిసి స్పెయిన్ లో హాలిడేను ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటికే స్పెయిన్ కు ప్రయాణిస్తున్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడం తెలిసిందే. తాజాగా స్పెయిన్ నుంచి మరో ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు క్యాప్షన్ ఏమీ లేదు. పిక్ కర్టసీ – చైతన్య అక్కినేని అని మాత్రం ఉంది. అంటే ఫోటో తీసింది చైతూనే. ఫోటో విషయానికి వస్తే బ్యూటిఫుల్ సముద్రం వ్యూ ఉన్న ఒక రిసార్టులో కుర్చీపై మోడరన్ జెనరేషన్ హాట్ బ్యూటీలా కూర్చుంది. గోల్డ్ కలర్ ఉన్న స్లీవ్ లెస్ టాప్ ధరించింది. ప్యాంట్ వేసుకోలేదు కానీ డెనిమ్ మైక్రో షార్ట్ వేసుకున్నట్టు అనిపిస్తోంది. దీంతో హాట్ నెస్ టన్నుల్లో కనిపిస్తోంది.

తలకు ఒక హెయిర్ బ్యాండ్ కట్టుకుని.. చేతికి ఓ స్టైలిష్ వాచ్ ధరించి సముద్రం వ్యూను ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇక ఈ ఫోటోకు మంచి స్పందనే దక్కింది. హాట్ అని పొగిడిన వారు కొందరైతే.. ‘పెళ్ళి అయింది.. డీసెంట్ గా ఉండు’ అని సంప్రదాయ సూచనలు అందించే బ్యాచ్ మరి కొందరు. ఏదైతేనేం.. సమంతా తన హాట్నెస్ తో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
Please Read Disclaimer