ఆ బయోపిక్ తర్వాత సామ్ లాంగ్ బ్రేక్?

0

స్టార్ హీరోయిన్ సమంతా ప్రస్తుతం స్పెయిన్ వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కినేని కుటుంబ సభ్యులు సమంతా మామగారు నాగార్జున 60 వ జన్మదిన వేడుకలను స్పెయిన్ జరుపుకుంటున్నారు. భర్త నాగచైతన్య.. మరిది అఖిల్.. ఇతర సన్నిహిత కుటుంబ సభ్యులు.. స్నేహితులతో ఈ సందర్భాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ వెకేషన్ నుంచి కొన్ని ఫోటోలను కూడా అభిమానుల కోసం షేర్ చేయడం జరిగింది. ఈ వెకేషన్ నుండి తిరిగి రాగానే ’96’ రీమేక్ కు సంబంధించిన పెండింగ్ షూటింగ్ ను పూర్తి చేస్తుందట. ఈ సినిమా తర్వాత సమంతా నటించే చిత్రాలపై ఇప్పటికే ఫిలిం నగర్ లో కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మామ నాగ్.. హబ్బీ చైతుతో కలిసి ఒక సినిమాలో నటించేందుకు సామ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా కాకుండా సామ్ మరో క్రేజీ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపిందనే టాక్ వినిపిస్తోంది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బయోపిక్ లో నటించేందుకు సామ్ రెడీగా ఉందట. మరి పీవీ సింధు పాత్రకు సామ్ సూట్ అవుతుందా లేదా అనేది ఆసక్తికరం. పీవీ సింధు ఓ టాల్ గర్ల్.. అయితే సమంతా పెద్ద హైటు ఉండే పర్సనాలిటీ కాదు. పీవీ సింధు పాత్రకు దీపిక పదుకొనె లాంటి టాల్ బ్యూటీ అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందనే ఇప్పటికే పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ చిత్రాన్ని సోనూ సూద్ నిర్మిస్తాడని సమాచారం. మరో విషయం ఏంటంటే ఈ సినిమా తర్వాత సామ్ ఓ రెండేళ్ళపాటు లాంగ్ బ్రేక్ తీసుకోనుందట. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికే ఈ లాంగ్ బ్రేక్ తీసుకునే ఆలోచనలో ఉందట ఒకవేళ అదే నిజమైతే ఈ సినిమా ప్రస్తుతానికి సామ్ లాస్ట్ ఫిలిం అవుతుంది.. ఆటోమేటిక్ గా ఈ సినిమాకు క్రేజ్ పెరగడం కూడా ఖాయమే.
Please Read Disclaimer