జానుకు బెస్ట్ ఛాయిస్ సమంత

0

జాను మూవీకి పెద్దగా పబ్లిసిటీ చేయకున్నా కూడా ప్రేక్షకుల్లో మాత్రం ఆసక్తి ఉంది. ముఖ్యంగా ఎవరైతే తమిళ 96 చిత్రం గురించి విన్నారో.. ఎవరైతే ఆ సినిమా కథ తెలుసుకున్నారో అలాంటి వారికి ఈ సినిమాపై ఆసక్తి చాలా ఉంది. వారంతా కూడా ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7వ తారీకున విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. నిన్న ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా శర్వానంద్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నారు.

శర్వానంద్ మాట్లాడుతూ.. స్కూల్ ఏజ్ లో నడిచే ప్రేమలు 99 శాతం ఫెయిల్ అవుతాయి. అలాగే ఈ సినిమా కూడా సాగుతుంది. క్లాసిక్ మూవీ అయిన 96 రీమేక్ అనగానే నాకు కాస్త టెన్షన్ అయ్యింది. కాని దిల్ రాజు గారిపై ఉన్న నమ్మకం తో ఆయన ఇంత నమ్మకంగా ఉన్నాడు కనుక నేను చేయగలను అనే ఉద్దేశ్యంతో ఈ సినిమాకు కమిట్ అయ్యాను. ఆయన ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు.. ఇప్పుడు జాను తో కూడా హిట్ ఇస్తారనే నమ్మకం ఉంది.

నా పాత్ర బాగా రావడంకు సమంత ప్రధాన కారణం. ఆమె కో స్టార్ అవ్వడం వల్ల నేను బాగా చేయగలిగాను. జాను పాత్రకు సమంత బెస్ట్ చాయిస్. ఆమె తప్ప మరెవ్వరు చేయలేరు అన్నట్లుగా శర్వానంద్ వ్యాఖ్యలు చేశాడు. ట్రైలర్ విడుదల ముందు వరకు సోషల్ మీడియాలో చాలా తక్కువ సందడి కనిపించేది. ఎప్పుడైతే ట్రైలర్ జనాల ముందుకు వచ్చిందో అప్పటి నుండి కూడా ఈ సినిమా గురించి ట్రెండ్ అవుతూనే ఉంది.
Please Read Disclaimer