ట్రెడిషనల్ డ్రెస్ లో అందాలు ఆరబోసిన సమంత

0

సమంత..గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన ‘ఏమాయ చేసావే’ సినిమా తో తెలుగు చిత్రపరిశ్రమకు కథానాయికగా పరిచయమైన విషయం తెలిసిందే. ఈ చిత్రం తో నటిగా మంచి గుర్తింపు తో పాటు పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. తన మొదటి హీరో నాగచైతన్య నే వివాహం చేసుకుని అక్కినేని ఫ్యామిలీ లో కోడలిగా అడుగు పెట్టింది. సామాజిక కార్యకలాపాల్లో ఎప్పుడూ ముందుండే సమంత సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది. తనకు కుదిరినప్పుడల్లా ఫోటోలను పోస్ట్ చేస్తూ యూత్ కి నిద్ర పట్టకుండా చేస్తుంది.

సమంత పేరు వింటే చాలు ఫిదా అయిపోతారు కుర్రకారు. అందులో సమంత మోడ్రన్ డ్రెస్ కాని వేసుకుని ఓ రెండు ఫోజులు కాని ఇచ్చిందనుకోండి..దానికి తోడు అలా ఓ నవ్వు కాని నవ్వితే..ఇక అంతే సంగతులు!. మరి అలాంటి సమంత సాంప్రదాయబద్ధంగా సల్వార్ కమీజ్ తో దర్శనమిస్తే…ఇంకేముంది అది చూసిన వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవాల్సిందే. ఇప్పుడు అలాంటి ఫొటోనే బయటకు వచ్చింది. ఇది ఓ సినిమా షూటింగ్ సమయం లో సమంత మొబైల్ లో నిమగ్నమై ఉన్నప్పుడు తీసిన ఫోటోగా అర్థం అవుతోంది. సమంత ఈ ఫొటోలో పింక్ సల్వార్ కమీజ్ మ్యాచింగ్ దుపట్టా తో అందంగా కనిపించింది. ఆమె ధరించిన మ్యాచింగ్ నెక్లెస్ చెవిపోగులు మరియు ఎరుపు రంగు గాజులు ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేసాయి. ఈ ఏడాది జాను సినిమా తో మరోసారి తన నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన సమంత హైదరాబాద్ టైమ్స్ మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్’ గా నిలిచిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-