భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం - LIVE

సమంత ఫేవరెట్ ఫుడ్ కూడా ఆయనకే తెలుసట!

0

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా తన మేనేజర్ ఆర్యన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం కు వెళ్లింది. నా కెరీర్ ఆరంభం నుండి నాతో ఉండి నన్ను తల్లిదండ్రుల కంటే ఎక్కువ గా చూసుకున్న వ్యక్తి ఆర్యన్ అంటూ అతడిపై తనకున్న అభిమానంను చూపించింది. నా జీవితంలో ఆర్యన్ చాలా కీలకమైన వ్యక్తి అయ్యాడంటూ సమంత చెప్పుకొచ్చింది. ఆర్యన్ కొత్త వ్యాపారం మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉందని సమంత చెప్పుకొచ్చింది.

రెస్టారెంట్ ప్రారంభ కార్యక్రమం తర్వాత మీడియాతో మాట్లాడిన సమంత పలు విషయాల ను చెప్పుకొచ్చింది. ఆ సమయంలోనే మీకు ఆల్ టైం ఫేవరెట్ ఫుడ్ ఏది అంటూ ప్రశ్నించగా ఠక్కున చెప్పలేక పోయింది. పక్కన ఉన్న ఆర్యన్ ను నా ఫేవరెట్ ఫుడ్ ఏది అంటూ నవ్వుతూ ప్రశ్నించగా అతడు సాల్మన్ ఫిష్ ఫుడ్ అన్నాడు. అప్పుడు సమంత నాకు సాల్మన్ ఫిష్ పుడ్ అంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. చేపల్లో అత్యంత మేలిమి రకం మరియు రుచికరమైన చేపగా సాల్మన్ ఫిష్ కు పేరుంది.

సాల్మన్ ఫిష్ వంటకాల ను అమితంగా అభిమానించి తినే తాను ఈమద్య కాలంలో పూర్తిగా వెజిటేరియన్ అవ్వడం వల్ల తినడం లేదని చెప్పుకొచ్చింది. తనకు ప్రస్తుతం వెజిటేరియన్ అంటే ఇష్టం అయ్యిందని సమంత చెప్పింది. సమంత తన ఫేవరెట్ ఫుడ్ ను కూడా మేనేజర్ ను అడిగి చెప్పడం చూసి అక్కడున్న వారు.. ఆ వీడియోలను చూసిన వారు అవాక్కవుతున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-