రీమేక్ కోసం త్రిషను దించేసిన సమంత

0

తమిళంలో తెరకెక్కి సూపర్ హిట్ అయిన ’96’ చిత్రాన్ని ప్రస్తుతం తెలుగులో రీమేక్ చేస్తున్న విషయ తెల్సిందే. తమిళనాట సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న 96 చిత్రంను తెలుగు ప్రేక్షకుల ముందుకు దిల్ రాజు తీసుకు రాబోతున్నాడు. ఒరిజినల్ వర్షన్ కు డైరెక్షన్ చేసిన ప్రేమ్ కుమార్ తెలుగు రీమేక్ కు కూడా చేస్తున్నారు. ఒరిజినల్ వర్షన్ లో విజయ్ సేతుపతి మరియు త్రిషలు నటించారు. తెలుగు రీమేక్ లో శర్వానంద్ మరియు సమంతలు నటించబోతున్నారు. ఈ చిత్రంను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలోని సమంత లుక్ తాజాగా లీక్ అయ్యింది.

షూటింగ్ అప్ డేట్స్ ఏమీ లేకపోవడంతో అసలు సినిమా ప్రారంభం అయ్యిందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని తాజాగా ’96’ చిత్రంలో త్రిష ఎలా అయితే కనిపించిందో అలాంటి కాస్ట్యూమ్స్ లోనే సమంత కనిపించింది. ఈ ఫొటోల్లో త్రిషను సమంత దించేసిందిగా అన్నట్లుగా ఉంది. 96 చిత్రం తెలుగు రీమేక్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. శర్వానంద్ మరియు సమంత జోడీ ఖచితంగా సక్సెస్ ను అందుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలే ‘ఓ బేబీ’ చిత్రంతో హిట్ కొట్టిన ముద్దుగుమ్మ సమంత వెంటనే ఈ సినిమాను మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రం టైటిల్ ను రివీల్ చేయడంతో పాటు.. ఫస్ట్ లుక్ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలోనే సమంత లుక్ రివీల్ అవ్వడంతో చిత్ర యూనిట్ సభ్యులు ఒకింత అసహనంకు గురవుతున్నారు. సమంత లుక్ లీక్ అవ్వడంతో ’96’ తెలుగు వర్షన్ అండర్ ప్రాసెస్ అనే విషయం కన్ఫర్మ్ అయ్యింది.
Please Read Disclaimer