అక్కినేని కోడలికి కలిసి రావట్లేదేంటి?

0

కొందరు హీరోయిన్స్ కి ప్రస్తుతం అస్సలు కలిసిరావట్లేదు. ఎన్ని ఎక్సపర్మెంట్లు చేసినా సక్సెస్ అనేది అందని ద్రాక్షలాగే ఊరిస్తుంది. ఈ లిస్టులో సమంత ముందుంది. అవును అక్కినేని కోడలు పిల్లకి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది. విమెన్ సెంట్రిక్ సినిమాతో ఓ అదిరిపోయే హిట్ కొట్టాలని చూస్తున్నా ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. ‘యూ టర్న్’ రివ్యూలు బాగా వచ్చినా కలెక్షన్స్ రాబట్టలేకపోయిది.

ఇక ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఓ బేబీ కూడా అమ్మడు ఊహించిన విజయం అందుకోలేదు. కేవలం మూడు రోజులు మాత్రం మంచి కలెక్షన్స్ వచ్చాయి. నాలుగో రోజు నుండే డ్రాప్ అవుతూ చివరికి బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ హిట్ అనిపించుకుంది. దీంతో అక్కినేని హీరోయిన్ ఇక ఫీమేల్ సబ్జెక్ట్స్ కి పులిస్టాప్ పెట్టేసి లవ్ స్టోరీస్ మీద దృష్టి పెట్టింది.

తాజాగా జాను అనే రీమేక్ సినిమాలో నటించిన సమంత నటిగా ప్రశంసలు దక్కించుకున్నప్పటికీ సినిమాతో హిట్ అందుకోలేకపోయింది. జాను మొదటి షో టాక్ విని సంబరపడిన సామ్ ఫైనల్ గా రిజల్ట్ చూసి ఖంగు తింది. లేటెస్ట్ గా సినిమా రిజల్ట్ విషయంలో ఇలా ఎందుకు జరిగిందనే భాదే అమ్మడుని వెంటాడుతుందట. ఇలా సమంత టచ్ చేసిన మూడు రీమేక్స్ లో ఓ బేబీ ఒక్కటి జస్ట్ పరవాలేదనిపిస్తే మిగతావి ఘోరంగా బోల్తా కొట్టాయి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-