అంటే ఎఫైర్ ఉండేదని ఒప్పుకున్నట్టేగా!

0

ప్రతి ఒక్కరి జీవితంలో దాదాపుగా ఏదో ఒక విఫల ప్రేమ ఉంటుంది. మనం వారిని వదిలెయ్యడమో.. వారు మనల్ని వదిలించుకోవడమో.. ఇద్దరి పేరెంట్స్ ప్రేమికులను విడగొట్టడమో.. లేక ప్రేమికులు ఇద్దరూ చర్చించుకుని బ్రేకప్ పార్టీ చేసుకుని మరీ బైబై చెప్పుకోవడమే జరిగి ఉంటుంది. సాధారణ వ్యక్తుల జీవితంలోనే కాదు సెలెబ్రిటిల లైఫ్ లో కూడా ఇలాంటివి ఉంటాయి. స్టార్ హీరోయిన్ సమంత లైఫ్ లో కూడా ఇలాంటివి ఉన్నాయి.

ఈమధ్య సమంతా ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్’ టాగ్ సాధించింది. ఈ సందర్బంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మాజీ లవర్ గురించి పరోక్షంగా మాట్లాడింది. “మహానటి సావిత్రి వ్యక్తిగత జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొందో నా జీవితంలో కూడా అలాంటివే జరిగాయి. నేను మందుగానే పసిగట్టడం తో ఆ బంధం నుంచి బయటపడ్డాను. తర్వాత చైతన్య లాంటి గొప్ప వ్యక్తి తో జీవితం పంచుకునే అవకాశం లభించింది” అంటూ మాజీ లవర్ పై ఓ బండ పడేసింది.

చైతన్య తో వివాహానికి ముందు.. అప్పుడెప్పుడో సమంతా-సిద్ధార్థ్ ల లవ్ స్టోరీ ఓ హాట్ టాపిక్. అయితే సమంతా ఎప్పుడూ ఆ విషయం గురించి ఒప్పుకోలేదు. మాట్లాడేందుకు ఇష్టపడలేదు. దీంతో అవి జస్ట్ రూమర్లు అన్నట్టుగానే మిగిలిపోయాయి. ఇన్నేళ్ళ తర్వాత.. అదీ చైతన్య తో వివాహం జరిగిన తర్వాత సామ్ “నా జీవితం సావిత్రి లైఫ్ లాగా అయి ఉండేది” అంటే దానర్థం లవ్ లో ఉండేదాన్ని అని ఒప్పుకున్నట్టేనని నెటిజన్లు అంటున్నారు.

అయినా పెళ్ళికి ముందు సమంతా – సిద్ధార్థ్ లవ్ సంగతి చాలామందికి తెలియదు. ఇప్పుడు ప్రత్యేకంగా అదంతా మాట్లాడి బయట పెట్టుకోవడం.. ఎక్కువ ప్రచారం కల్పించుకోవడం ఎందుకో మరి. ఇప్పుడు కనుక సిద్ధార్థ్ కూడా ఏదో ఒక కామెంట్ చేస్తే ఈ ఎపిసోడ్ సీరియల్ గా కొనసాగే అవకాశం పుష్కలంగా ఉంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-