‘కత్తి’తో సమంత…రిలీజ్ ఎప్పుడంటే?

0

సమంత రూత్ ప్రభు…కాదు కాదు…ఇప్పుడు ఆమె సమంత అక్కినేని….సహజంగా హీరోయిన్స్ అంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్న ఫార్ములాతో సేల్ అయిపోతూ ఉంటారు. అయితే అలాంటి హీరోయిన్స్ లో నేను చాలా డిఫరెంట్ అంటుంది సమంతా..అదేలా అంటారా..ఒక్కసారి ఈ మ్యాటర్ పై లుక్ వెయ్యండి. మీకే అర్ధం అవుతుంది. సమంత…చైతు ఇద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సహజంగా పెళ్లి తర్వాత ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఇంటికి పరిమితం అయిపోతుంది…సినిమాల విషయంలో కాస్త వెనకడుగులు వేస్తూ ఉంటారు…కానీ నేను అలా కాదు…సినిమా సినిమానే…పెళ్లి పెళ్ళే అంటుంది మన అందాల భామ సమంత.

ఆమె పెళ్లి తర్వాత అనేక సినిమాల్లో నటించింది. ఒకటి కాదు రెండు కాదు..రంగస్థలం మహానటి అభిమన్యుడు…యూటర్న్ ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయింది. అలా అని హీరోయిన పాత్రలు కాకుండా కేవలం సోలో పాత్రలే వేసిందా అంటే లేనే లేదు రంగస్థలంలోను అభిమన్యుడు లోను ఆమె హీరోయిన గా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో పక్క తన భర్త చైతుతో కలసి మజిలీలో నటిస్తూనే ఇంకో పక్క 96 లాంటి సినిమాను కూడా ఒకే చేసింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు సమంత మరో మూవీతో త్వరలోనే అంటే మజిలీ సినిమా రిలీజ్ కి ముందే ప్రేక్షకులను పలకరించనుంది. ఇంతకీ ఏ సినిమా అంటారా…ఆ సినిమా పేరే ‘సూపర్ డీలక్స్’. ఈ సినిమా పాత సినిమా అయితే కాదు అలా అని కొత్త సినిమా అంటే కాదు అని అనలేం ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యీ చాలా కాలమే అయ్యింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.

అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమాలో సమంత సరికొత్త పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పోస్టర్స్ చూస్తే ఆమె ఏదో మర్డర్ చేస్తున్నట్లు మటన్ కొట్టే కత్తిని చేతిలో పట్టుకుని ఉంది. అంతేకాదు తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అయితే తమిళ్ లోను తెలుగు లోను ఒకే సారి రిలీజ్ చేసే దిశగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాను మార్చి 29న అటు తమిళ్ ఇటు తెలుగు రెండు బాషల్లో రిలీజ్ చెయ్యడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి…మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరో నెల రోజులు ఆగాల్సిందే.
Please Read Disclaimer