సమంతలో ఆ యాంగిల్ ను చూడగలమా?

0

సమంత అనగానే తెలుగు ప్రేక్షకులకు ఒక అందమైన రూపం.. చక్కన నటన.. నవ్వుతూ ఉండే ఆమె ఫేస్ గుర్తుకు వస్తాయి. అలాంటి సమంత తాను సీరియస్ గా మారబోతున్నాను. విలన్ పాత్ర చేస్తున్నాను అంటూ ప్రకటించింది. విలన్ గా తాను చేస్తున్న వెబ్ సిరీస్ అతి త్వరలోనే రాబోతుందని కూడా ఆమె ప్రకటించింది. తన విలన్ పాత్ర ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుంది అంటూ తాజాగా జాను ఇంటర్వ్యూలో ప్రకటించింది. కాని ప్రేక్షకులు మాత్రం ఆమె సర్ ప్రైజ్ పై ఆసక్తి చూపడం లేదు.

సమంతను తాము హీరోయిన్ గా మాత్రమే చూడగలమని విలన్ పాత్రలో చూడలేమంటూ ఆమె అభిమానులు చెబుతున్నారు. అయితే నటిగా నిరూపించుకునేందుకు సమంత విలన్ పాత్రలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ వెబ్ సిరీస్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లుగా సమంత చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు హీరోయిన్ గా మెప్పించిన ఈమె విలన్ గా కూడా మెప్పించడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.

జాను చిత్రంలోని నటనతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ముద్దుగుమ్మ సమంత కమర్షియల్ సినిమాలపై ఎక్కువ ఆసక్తి చూపడటం లేదు. నాగచైతన్యతో వివాహం తర్వాత ఆమె సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా యూటర్న్.. ఓ బేబీ అంటూ లేడీ ఓరియంటెడ్ చిత్రాలను మాత్రమే చేస్తూ వస్తుంది. తాజాగా జానుతో మరో సక్సెస్ ను సమంత తన ఖాతాలో వేసుకుంది. ఇక మరో మూడు నాలుగు సంవత్సరాల తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్తానంటూ సమంత షాకింగ్ ప్రకటన చేసిన విషయం తెల్సిందే.
Please Read Disclaimer