అక్కినేని కోడలు విలన్ వేషాలు!

0

చూడగానే అమాయకత్వం కలబోసిన రూపం. నోట్లో వేలు పెడితే కొరుకుతుందా? అనుకుంటారు. కానీ ఆ అమాయకత్వం మాటున కరుడుగట్టే విలనీ బిత్తరపోయేలా చేస్తుందట. సైలెంట్ విలన్ గా సరదా తీర్చేస్తుందట. ఇంతకీ ఎవరు? అంటే.. అక్కినేని కోడలు సమంతనే ఇలా చేస్తుందట. ఏ సినిమాలో అంటే..?

మూవీలో కాదు.. ఓ వెబ్ సిరీస్ లో అలా విలన్ వేషాలు వేస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం అమెజాన్ లో ఫ్యామిలీ మ్యాన్ – తెలుగు వెబ్ సిరీస్ జనాల్లో హాట్ టాపిక్ గా మారింది. మనోజ్ భాజ్ పాయ్- ప్రియమణి లాంటి స్టార్లు ఈ వెబ్ సిరీస్ లో నటించారు అనే కంటే జీవించారనే చెప్పాలి. సినిమాని మించి ఈ వెబ్ సిరీస్ ఆకట్టుకుంది. తెలుగు కుర్రాళ్లు రాజ్ అండ్ డీకే దర్శకులుగా ఇరగదీస్తున్నారు. ఇప్పటికే ఒక సీజన్ ముగింపులో ఉంది. తదుపరి కొత్త సీజన్ కూడా మొదలవుతుందట.

ఈ లోగానే ఈ వెబ్ సిరీస్ కోసం సమంత తో దర్శకులు సంప్రదింపులు జరిపి ఓ ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రచారమైంది. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో సమంత పెర్ఫామ్ చేయనుందని తెలుస్తోంది. ఇక ఇలా సామ్ పెద్ద తెర నుంచి అమాంతం వెబ్ సిరీస్ బాటలోకి రావడానికి కారణం కూడా ఉంది. ఇక్కడ సక్సెసైతే తాను కూడా సొంత నిర్మాణ సంస్థలో వెబ్ సిరీస్ లు నిర్మించాలన్నది ప్లాన్. వాటిలో నటిస్తూ ప్రొడక్షన్ బాధ్యతల్ని చూసుకుంటుందట. ఇందులో కొత్త తరాన్ని ప్రోత్సహించే సినిమాలు చేస్తుంది. అలాగే నాయికా ప్రాధాన్యత ఉన్న కథల్ని ఎంచుకుని తాను కూడా నటిస్తుంది. అదీ బిగ్ ప్లాన్.