కోడలికి అమ్మా నాన్న కంటే ఎక్కువ!

0

పెళ్లి తర్వాత హీరోయిన్లకు అవకాశాలు కష్టమే. కొందరు ఇంటి పట్టునే ఉండి భర్త పిల్లలే జీవితంగా గడిపేస్తారు. ఎందుకంటే మూడు ముళ్లు పడ్డాక కెరీర్ పాకులాట ఎందుకులే.. అయినా తమను ఎవరు పట్టించుకుంటారు అన్న ఆలోచన ఉంటుంది. అయితే ఇదంతా సత్తు కాలం ఆలోచన అనుకునే మోడ్రన్ కోడళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందరిదీ ఒక దారి అయితే తన రూటే సపరేటు అంటూ అగ్ర కథానాయిక హోదాను నిలబెట్టుకుంది అక్కినేని కోడలు సమంత. భర్త- మామ అండదండలతో టాలీవుడ్ లో బెస్ట్ కథానాయికగా పేరు తెచ్చుకుంది.

అక్కినేని హీరో నాగచైతన్యను సామ్ రెండేళ్ల క్రితం పెళ్లాడిన సంగతి తెలిసిందే. వివాహానంతరం ఈ జంట కలిసి సినిమాలు చేస్తున్నారు. 2019లో మజిలీ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు. ఈ మూవీ యువతరం గుండెల్ని టచ్ చేయడంతో అంత పెద్ద హిట్టయ్యిందన్న ప్రశంసలు దక్కాయి. అదే సమయంలో కుటుంబ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులనూ మజిలీ మెప్పించింది. అటుపైనా ఓబేబి చిత్రంతో సామ్ బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆ తర్వాత సమంతకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం శర్వానంద్ తో కలిసి జాను ఊహించని సెట్ బ్యాక్ అనే చెప్పాలి. వచ్చని ఈ అమ్మడు తన నటప్రతిభతో అందరినీ ఆకట్టుకుందనే చెప్పాలి. జాను బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యి నిరాశపరిచింది.

ఇక సామ్ వ్యక్తిగత జీవితంలో కీలక వ్యక్తి గురించి సమంత చెప్పిన సంగతులు ఆశ్చర్యపరిచాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత ఆసక్తికర సంగతుల్ని రివీల్ చేసింది. తన జీవితంలో అమ్మా నాన్నల్ని మించి తనని జాగ్రత్తగా చూసుకున్న తన అసిస్టెంట్ ఆర్య గురించి తెలిపింది. తనను అమ్మనాన్నల్లా చూసుకున్నాడని అతనంటే తనకెంతో ఇష్టమని సామ్ వెల్లడించింది. దీంతో ఆ ఆర్య ఎవరు? ఏమిటీ తన ప్రస్తావన అంటూ నెటిజన్లు అంతర్జాలంలో సెర్ఛ్ చేస్తున్నారు. తన అసిస్టెంట్ ఆర్య `ఏం మాయ చేశావే` చిత్రం నుంచి తనతోనే ఉన్నారని.. చాలా డెడికేషన్ తో వర్క్ చేస్తారని తెగ పొగిడేసింది. చలి-ఎండ-బాధ- సంతోషం ఇలా ప్రతి విషయంలోనూ తనతో ఉన్నాడని చెప్పుకొచ్చింది. తనను అమ్మనాన్నలా ఇప్పటి వరకు చూసుకున్నాడని ఇకపై కూడా అంతే చూసుకుంటాడని తేల్చేసింది. ఈ అసిస్టెంట్ ఆర్య హైదరాబాద్ లో హెల్తీ వే రెస్టారెంట్ ను ప్రారంభించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె అక్కడే ఫుడ్ తిని తన అసిస్టెంట్ ను పొగడ్తలతో ముంచెత్తింది. తన అసిస్టెంట్ ఆర్య అసిస్టెంట్ గానే ఉండిపోకూడదని ఇంకా మరింత ఎత్తుకు ఎదగాలని సామ్ ఆశీర్వదించింది. అవునులే ఇలాంటి నమ్మకస్తులను మరింత ప్రోత్సహించడం ఎంతైనా మంచి ఆలోచనేనంటూ సమంతను నెటిజనులు అభినందిస్తున్నారు. ఇకపోతే తనను తన అమ్మా నాన్నల్ని మించి చైతూ ప్రేమించాడా లేదా? అన్నది మాత్రం సామ్ చెప్పలేదేమిటో!
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-