సమంత: చెప్పేదొకటి..చేసేదొకటి!

0

ఈ లోకం తీరే అంత. పైకి చెప్పేది ఒకటి.. నిజంగా చేసేది మరొకటి. మెజారిటీ జనాల తీరు అంతే. కులం లేదంటారు.. సొంతకులపోళ్ళకే పనులు చేసుకుంటారు. డబ్బు ప్రధానం కాదంటారు.. ఎవరిదగ్గరైనా డబ్బు లేకపోతే వాడిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తారు. సాధారణ జనాలే కాదు.. సెలబ్రిటీలు కూడా ఇలాంటి విషయాలకు అతీతం కాదు. సెలబ్రిటీలు ఎన్నో ప్రోడక్టులకు ప్రచారం చేస్తుంటారు.. జనాలను వాటిని కొనాలని.. వాడాలని సందేశం ఇస్తారు. కానీ వారు మాత్రం ఆ ఉత్పత్తులను వాడరు. ఈ విషయంపై సినిమాల్లో జోకులు కూడా వచ్చాయి. ఇప్పటికే ఇలా ‘చెప్పేదొకటి చేసేదొకటి తీరు’తో చాలామంది సెలబ్రిటీలు బుక్కయ్యారు. తాజాగా సమంతా వంతు వచ్చింది.

సమంతా కొంతకాలం క్రితం తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా శాంసంగ్ ఎం30 ఫోన్ కు ప్రమోషన్ చేసింది. ఆ ఫోన్ సూపర్ అని.. తన మనసును చూరగొంది అని.. లాంగ్ బ్యాటరీ లైఫ్ అని.. మీరు కూడా దీనిపై ఒక లుక్కెయ్యండి అని ఎంతో గొప్పగా ప్రచారం చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. దాదాపు నాలుగైదు నెలల క్రితం జరిగిన విషయం అది. సీన్ కట్ చేస్తే తాజాగా సమంతా వన్ ప్లస్ 7 ప్రో ఫోన్ లాంచ్ ఈవెంట్ కు హాజరైంది. ఈ ఫోన్ గురించి కూడా ఎంత గొప్పగా మాట్లాడాలో అంత గొప్పగా మాట్లాడేసింది.

ఇక్కడ అసలు విషయం ఏంటంటే సమంతా నిజానికి ఈ రెండూ ఫోన్లను వాడడం లేదు. నిన్న ఎయిర్ పోర్ట్ దగ్గర ఐ ఫోన్ వాడుతూ ఫోటోగ్రాఫర్ల కంటపడింది. సమంతా వాడేది ఐ ఫోన్ 11 ప్రో వెర్షన్. ప్రచారం చేసేది వేరే బ్రాండ్ ఫోన్లకు అయినా వాడేది మాత్రం వేరే ఫోను. దీంతో నెటిజన్లు సమంతాపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రమోషన్ చేసేది మాత్రం వేరే ఫోన్లకు కానీ వాడేది మాత్రం ఐ ఫోనా అంటూ ప్రశ్నిస్తున్నారు. మన ప్రమోషన్ స్టార్లలో సగం మంది ఇంతేనని సరిపెట్టుకోవాలి.. కార్పోరేట్ బ్రాండ్స్ డబ్బు చేల్లిస్తాయి.. స్టార్లు ప్రమోషన్ చేస్తారు.. అంతే. అభిమానులు అది అర్థం చేసుకుంటే చాలు.
Please Read Disclaimer