చైతూ సాయిపల్లవి ముద్దు సీన్ పై సామ్ కామెంట్స్

0

నాగచైతన్య.. సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ చిత్రం ఎయ్ పిల్లా మ్యూజికల్ ప్రివ్యూ నేడు వాలంటైన్స్ డే సందర్బంగా విడుదల చేయడం జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగచైతన్య మరియు సాయి పల్లవిల లుక్ మరియు సినిమా మేకింగ్ చూస్తుంటే మరో ఫిదాలా ఉంటుందేమో అనిపిస్తుంది. ఇక ఈ వీడియో చివర్లో చైతూకు సాయి పల్లవి ముద్దు పెట్టడం వీడియో మరింత హైలైట్ అయ్యేలా చేసింది. సాయి పల్లవి ముద్దు పెడితే నాగచైతన్య ఎమోషనల్ అయ్యి కన్నీరు పెట్టుకోవడంతో ఈ వీడియో గురించి మాట్లాడుకునేలా చేసింది.

ఇక ఈ వీడియోను ట్వీట్ చేసిన నాగచైతన్య భార్య సమంత చాలా బాగుందంటూ కామెంట్ పెట్టింది. అదే సమయంలో ఆ చివరి షాట్ చూసిన తర్వాత నా తల కొన్ని సెకన్ల పాటు ఆగిపోయినట్లయ్యిందంటూ ఫన్నీగా స్పందించింది. అది లిప్ లాక్ సీన్ కాకున్నా కూడా సమంత షాక్ అయ్యేలా చేసిందట. అదే లిప్ లాక్ సీన్ అయ్యి ఉంటే చైతూ.. సాయి పల్లవి లిక్ లాస్ సీన్ చేసి ఉంటే అమ్మడి గుండె జారిపోయేదేమో కదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఏ భార్య అయినా తన భర్తను మరో యువతి ముద్దు పెట్టుకుంటే.. ముద్దు వరకు ఎందుకు కనీసం పట్టుకున్నా కూడా ఏదో ఒక మూలన ఫీల్ అవుతూనే ఉంటారు. సమంత కూడా ఒక భార్యనే కదా. ఎంత హీరోయిన్ అయినా కూడా తన భర్తను వేరే హీరోయిన్ ముద్దు పెట్టుకుంటే కాస్త ఇబ్బంది పడ్డట్లుగానే ఉంది.
Please Read Disclaimer