షాకిస్తున్న సామ్ పారితోషికం

0

మజిలీ- ఓ బేబి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో సమంత రెట్టించిన జోష్ తో ఉన్న సంగతి తెలిసిందే. అక్కినేని కోడలు తెలివైన ఎంపికలతో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఇక ఇప్పటికి ఉన్న ఇతర నాయికలతో పోలిస్తే సమంత తదుపరి ప్రణాళికలు ఎంతో వైవిధ్యంగానే కనిపిస్తున్నాయి. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి అందులో సినిమాలు నిర్మించాలన్న ప్లాన్ ఉంది. బాలీవుడ్ లో అనుష్క శర్మ తరహాలో టాలీవుడ్ లో తాను పాపులరవ్వాలన్న భావనతో ఉంది.

పనిలో పనిగా డిజిటల్ మాధ్యమం ఓటీటీపైనా దృష్టి సారించింది. మునుముందు అక్కినేని కాంపౌండ్ ఓటీటీ వేదికను అభివృద్ధి చేసే ఆలోచనలోనూ ఉందన్న సమాచారం ఉంది. ఇక ఈ వేదికపై వరుసగా వెబ్ సిరీస్ లలో నటించేందుకు సమంతకు ఆస్కారం ఉందట. అందుకే ఇప్పటినుంచి వెబ్ సిరీస్ టోన్.. ఆదరణ ఎలా ఉండబోతోంది? అన్నది చెక్ చేస్తోంది. తొలిగా రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ `ఫ్యామిలీ మ్యాన్` రెండో సీజన్ లో నటించేందుకు అంగీకరించింది.

ఇందులో తన పాత్ర ఎంతో స్పెషల్ గా ఉంటుందని తెలిసింది. ఇక ఇదే వెబ్ సిరీస్ లో ప్రియమణి మరో కీలక పాత్ర పోషిస్తోంది. సీజన్ వన్ లో తన పాత్ర ఆద్యంతం రక్తి కట్టించింది. అయితే ఈసారి సమంత పోషించే పాత్ర ఎలాంటిది? అన్నది తెలియాల్సి ఉంది. తీవ్రవాదులు కుట్రలు.. పోలీస్ ఆపరేషన్.. బార్డర్ టెర్రరిజం.. ఫ్యామిలీ గొడవలు.. వగైరా వగైరా థీమ్ తో ఫ్యామిలీ మ్యాన్ థ్రిల్లర్ మోడ్ లో రక్తి కట్టిస్తోంది. మునుముందు టీవీ సీరియళ్ల స్థానంలో వెబ్ సిరీస్ లకు ఆదరణ పెరగడం ఖాయమని నమ్మకం తెచ్చింది ఈ సిరీస్ నే. అందుకే సామ్ చేస్తున్న ప్రయోగంపై ఆసక్తి నెలకొంది. తాను ఎలాంటి పాత్రలో కనిపించబోతోంది? అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నందుకు సమంతకు కళ్లు తిరిగేంత భారీ పారితోషికం అందజేస్తున్నారని తెలుస్తోంది.
Please Read Disclaimer