సమంతా ఎవరికి టార్గెట్ అయ్యింది?

0

అక్కినేని కోడలయ్యాక కూడా అవకాశాలకు లోటు లేకుండా చూసుకుంటున్న సమంతాపై గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారం మీద తనే స్వయంగా స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా 96 తెలుగు రీమేక్ వెర్షన్ ప్రారంభించడానికి జరుగుతున్న ఆలస్యానికి తనే కారణమంటూ కొన్ని కథనాలు రావడంతో ఇది కొత్త చర్చకు దారి తీసింది.

తన పాత్ర పరిధి గురించి స్క్రిప్ట్ లో ఇవ్వాల్సిన ప్రాధాన్యత గురించి దర్శకనిర్మాతలను డిమాండ్ చేస్తుండటంతో ఇదో ఇబ్బందికరమైన పరిణామంగా మారిందని గట్టి కామెంట్స్ వినిపించాయి. అయితే సామ్ వీటిని పూర్తిగా కొట్టి పారేస్తోంది. ఏ సినిమా విషయంలోనూ తన జోక్యం ఉండదని కేవలం చెప్పినట్టు నటించడం మాత్రమే చేస్తానని ఇలా ఎలా ప్రచారం చేస్తారంటూ ఫైర్ అయ్యినంత పని చేసింది

మజిలిలో సైతం నాగ చైతన్య తన పాత్రలకు సంబంధించి ఏవో మార్పులు అడిగినట్టు వచ్చిన రూమర్స్ ని కూడా సాం ఖండించింది. ఇలాంటి బేస్ లెస్ రూమర్స్ కు తాను స్పందించాల్సిన అవసరం లేదని అయినా ఇవి శృతి మించి పోవడంతో చెప్పక తప్పడం లేదని పేర్కొంది.

రానున్న రెండు వారాలు సమంతాకు చాలా కీలకంగా నిలవబోతున్నాయి. మార్చ్ 29న సూపర్ డీలక్స్ ఏప్రిల్ 5న మజిలి కేవలం వారం రోజుల గ్యాప్ లో విడుదల కానున్నాయి. రెండూ చాలా స్పెషల్ మూవీస్ కావడంతో కొత్త ఏడాది గ్రాండ్ గా ఓపెన్ కావాలనే కోరికతో ఉంది సాం. మరి అవి నెరవేరుతాయో లేదో ఏప్రిల్ ఫస్ట్ వీక్ కి తేలిపోతుంది.




Please Read Disclaimer