సామ్ కే యోగా భంగిమలు నేర్పిస్తున్న వీడెవడు?

0

వీడు ఎవడో కానీ ఆకతాయి అల్లరి వేషాలు ఎక్కువైపోతున్నాయ్ సామ్ .. కాస్త కంట్రోల్లో పెట్టు. లేదంటే ఇకపై కష్టం అవుతుంది మరి! ఎవరీ అల్లరి గడుగ్గాయ్.. అంటే.. ఇంకెవరు… సామ్ కి బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ కంపానియన్. ఈ అల్లరి గడుగ్గాయ్ కి పేరు కూడా ఏదో ఉంది. అల్లరల్లరి చేసేయడమే కాదు.. అక్కినేని కోడలికి తీరిక సమయం చిక్కితే బోలెడన్ని ఆటలు ఆడేసుకుంటాడు. ఓవైపు హబ్బీ నాగచైతన్యతో ఆటలు.. మరోవైపు ఈ క్యూట్ పెట్ డాగ్ తోనూ ఆటలు .. సామ్ కి ఆటవిడుపు బాగానే ఉంది కానీ..!

సంథింగ్ స్పెష్ ల్ గా.. సంథింగ్ స్పైసీగా ఈ ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంతకీ ఎవరీ ఫోటో తీసినది? అంటే.. కృష్ణ వికాస్ అని తెలిసింది. సామ్ తీరిక వేళల్లో యోగా చేస్తున్న సమయంలో కూడా ఈ అల్లరి డాగ్ కంపెనీ ఇస్తున్నట్టే కనిపిస్తోంది. పక్కనే యోగా మ్యాట్ ని చుట్టేసి రిలాక్సవుతున్న సమంతతో ఇలా కూత్ కూత్ ఆటలు ఆడేస్తోంది.

అన్నట్టు ఫిట్నెస్ ఫ్రీక్ సమంతకే యోగా నేర్పిస్తున్నట్టుంది ఈ క్యూటీ డాగ్. ఆ భంగిమ చూస్తుంటే యోగా స్పెషలిస్టులాగే కాళ్లు రెండూ వెనక్కి చాచింది. ముందరి కాళ్లపై తలను ఆన్చింది. వ్వాటే పెట్ డాగ్ టైమ్ పాస్ యార్.. ఎలానూ ఆరేడు నెలలుగా షూటింగుల్లేక తీరిక సమయాన్ని ఎలా స్పెండ్ చేయాలి? అనుకునేవారికి ఇలాంటివి ఎంతో రిలాక్సేషన్ అనే చెప్పాలి. మై పెట్ డాగ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనేలా సామ్ తో సింకయిపోయిన ఈ క్యూటీ డాగ్ ని మెచ్చుకుని తీరాలి. అన్నట్టు సామ్ నటించిన ఫ్యామిలీమ్యాన్ 2 వెబ్ సిరీస్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో చెప్పనే లేదు?