కొత్తదనం ఉంటే చెప్పండి అంటున్న సమంత

0

స్టార్ హీరోయిన్ సమంతా ఈ మధ్య సినిమాల ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఈ ఏడాది సమంత నటించిన సినిమాలు చూస్తేనే ఆ విషయం మనకు అర్థం అవుతుంది. తెలుగు లో ‘మజిలీ’.. ‘ఓ బేబీ’ సినిమాల్లో నటిస్తే రెండూ హిట్లే. ఇక తమిళం లో నటించిన ‘సూపర్ డీలక్స్’ కూడా హిట్టే. సూపర్ డీలక్స్ లో సమంతా పాత్ర రోటీన్ కానే కాదు.. అదో బోల్డ్ పాత్ర. సమంతా ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యే పాత్ర.

ఇక ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో కూడా సమంతా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. సామ్ ప్రస్తుతం ’96’ రీమేక్ లో నటిస్తోంది. ఈ సినిమా లో సామ్ వర్క్ పూర్తయిందట. దీంతో సామ్ నెక్స్ట్ ప్రాజెక్టు కోసం కథలు వింటోందట. అయితే తన వద్ద కు వచ్చే దర్శకులకు రొటీన్ గా.. రెగ్యులర్ గా ఉండే పాత్రలు వద్ద ని చెప్తోందట. బలమైన పాత్రలు అయితేనే ఆసక్తి చూపిస్తోందట. బోల్డ్ గా ఉన్నా ఫరవా లేదని.. కొత్తదనం తప్పని సరిగా ఉండాలని చెప్తోందట. అందుకే సమంతా నటించే కొత్త సినిమాలు ఇంకా ఫైనల్ కాలేదని సమాచారం. త్వరలోనే సమంత ఫ్యూచర్ ప్రాజెక్టుల పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే సమంతా.. శర్వానంద్ నటిస్తున్న ’96’ రీమేక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ డిసెంబర్.. జనవరి సీజన్ అంతా ఫుల్ కాంపిటీషన్ ఉంది కాబట్టి వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ ఉండొచ్చు. ఈ సినిమా రిలీజ్ అయ్యే లోపు సమంతా కొత్త సినిమాల ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Please Read Disclaimer