సామ్ ఏ మూడ్ లో ఉందో ఇక నుంచి చెప్పేయొచ్చు!

0

హాట్ ఫోటోల్నే కాదు.. స్వీట్ సంగతుల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా చెప్పేస్తుంటారు సమంత. భర్త నాగ చైతన్యకు మాత్రమే తెలిసిన విషయాల్ని..కొన్నిసార్లు అదాటున అందరికి చెప్పేసే లక్షణం సామ్ లో కనిపిస్తుంటుంది. తాజాగా హాలీడే మూడ్ లో ఉన్న ఆమె.. తనకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది.

తన చేతి వేళ్లకు సంబంధించి ఆమె చెప్పిన విషయం చూస్తే.. రానున్న రోజుల్లో సామ్ షూటింగ్ లో బిజీగా ఉందా? లేదంటే ఖాళీగా ఉందా? అన్న విషయాన్ని చెప్పేయొచ్చు. ఎందుకంటే.. ప్రస్తుతం భర్తతో కలిసి సమంత హాలీడే ట్రిప్ లో ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా నెయిల్ పాలీష్ తో నిగనిగలాడుతున్న తన నెయిల్స్ పిక్ ను పోస్ట్ చేసింది.

హాలీడే తీసుకోవచ్చని చెప్పటానికి నాకెవరూ అక్కర్లేదు.. తన గోళ్లే చెప్పేస్తాయని చెప్పింది. తానుచేసే పాత్రలకు నెయిల్ పాలిష్ అవసరం లేదని.. అన్ని పాత్రలూ దాదాపు అంతేనని.. అందుకే నెయిల్ పాలీష్ వేసుకునే టైం ఉందంటే.. వెకేషన్ కు టైమ్ వచ్చేసినట్లేనని చెప్పింది. తాజాగా తానిప్పుడు నెయిల్ పాలీష్ వేసుకున్నానని చెప్పటం ద్వారా తానేం చేస్తున్నానన్న విషయాన్ని చెప్పేసింది సామ్. భర్త నాగచైతన్య క్లిక్ చేసిన ఫోటోను.. ఇష్టంగా నెయిల్ పాలిష్ వేసుకున్న చేతి వేళ్ల ఫోటోను షేర్ చేశారు. తనను అభిమానించే అభిమానులకు ఇష్టంగా విషయాల్ని చెప్పటం.. ఫోటోల్ని షేర్ చేయటంలో సామ్ కు సాటి మరెవర్వరూ రారేమో?
Please Read Disclaimer