రాజేంద్ర ప్రసాద్ కామెడీ టీచర్!-సమంత

0

“రామానాయుడు ఫ్యామిలీ నుంచి తొలిసారి ఒకమ్మాయి వస్తోంది అని సురేష్ బాబు గారు చెప్పినప్పుడు చాలా ఆనందం కలిగింది. ఆయన చెప్పిన మాట కోసం చాలా కష్టపడ్డాన“ని అన్నారు అక్కినేని కోడలు సమంత. సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన `ఓ బేబి` జూలై 5న రిలీజవుతోంది. హైదరాబాద్ లో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో సమంత మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. ఓబేబి గురించి.. ఇండస్ట్రీ వ్యవహారాల గురించి సామ్ ఈ వేదికపై చాలా సూటిగా మాట్లాడారు.

సమంత మాట్లాడుతూ “ఓ బేబి రూపంలో కెరీర్ బెస్ట్ అవకాశం ఇచ్చారు నా నిర్మాతలు. ఈ కథను మేం సెలక్ట్ చేయడం కన్నా.. ఈ కథే మమ్మల్ని సెలక్ట్ చేసుకుందని నమ్ముతున్నా. షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతిరోజూ నాకు ఒక సంతోషాన్ని.. ఒక చాలెంజ్ ని ఇచ్చింది. ఇందులో నేను చాలెంజింగ్ పాత్ర చేశాను. నా కెరీర్ లో ఇప్పటిదాకా చేసిన రోల్స్ లో ఇదే బెస్ట్ రోల్ ఇదే. నందిని నాకు అక్కతో సమానం. నేను ఆమెను 100 శాతం నమ్మాను. ఆ నమ్మకం నా నటనలో చూస్తారు“ అని అన్నారు. ఈ సినిమా పరంగా నటీనటులే కాదు సాంకేతిక నిపుణులు గుర్తుకొస్తారని సమంత తెలిపారు. హీరోయిన్ ఓరియంటెడ్ చేయాలంటే ఇండస్ట్రీలో చాలా కష్టం. నిర్మాతలు నన్ను నమ్మి చేశారంటే అందుకు కారణం అభిమానులే. వాళ్లే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారని అన్నారు.

హాస్యాన్ని పండించడంలో సుదీర్ఘ అనుభవం ఉన్న రాజేంద్ర ప్రసాద్ తనకు ఎంతో నేర్పించారని సమంత అన్నారు. సినిమాలో ఫన్ ఎలివేషన్ తనవల్లనే సాధ్యమైందని తెలిపారు. ఓబేబి ద్వితీయార్థం ఆద్యంతం నాగశౌర్య పాత్ర హైలైట్ గా ఉంటుందని అన్నారు. సినిమాకి పని చేసిన వారి కంటే మీరు చెబితేనే బావుంటుంది.. నిజాయితీగా బయటి వాళ్లే చెప్పగలరు. అందరి అంచనాల్ని చేరే చిత్రమిదని సమంత అన్నారు. మొత్తానికి సామ్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఓ బేబి తన కెరీర్ కి మరో హిట్ చిత్రంగా నిలుస్తుందనే భావించాలి.
Please Read Disclaimer