సామ్ .. ది లేడీ రెబల్ స్టార్

0

టాలీవుడ్ లో రెబల్ స్టార్ ఎవరు? అంటే ప్రభాస్ వైపే అన్ని వేళ్లు చూపిస్తాయి. కానీ ఇప్పుడు ఓ లేడీ రెబల్ స్టార్ గురించి అంతే వాడి వేడిగా చర్చ సాగుతోంది. ఇంతకీ ఎవరా లేడీ రెబల్ స్టార్ అంటే..? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఫోటో చూస్తే మీరే చెబుతారు. చైతూని పెళ్లాడి అక్కినేని కోడలుగా ప్రమోటైన సమంత ఆఫర్ట్ మ్యారేజ్ రివల్యూషన్స్ గురించి అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

యువహీరో నాగచైతన్యకు భార్యగా.. అక్కినేని కోడలుగా ప్రమోటైనా తనలోని రెబల్ యాటిట్యూడ్ లో ఏమాత్రం మార్పు రాలేదని అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. కాంపిటీటర్స్ ఎందరు ఉన్నా.. ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ ని అనుకరించడంలో సామ్ తర్వాతనే. మార్కెట్లోకి వచ్చే ప్రతి అల్ట్రా మోడ్రన్ డ్రెస్ కి తానే బ్రాండ్ ప్రమోటర్ అన్నంతగా ఫ్యాన్స్ ని అలరిస్తూనే ఉంది.

ఓవైపు తెలంగాణ ప్రభుత్వం చేనేతకు ప్రచారకర్తగా సమంతనే ఎంచుకోవడానికి కారణమేంటో ప్రతి ఒక్కరూ ఆరా తీస్తూనే ఉన్నారు. అందుకు సమంత ప్రతిసారీ ఇలా ప్రాక్టికల్ గానే సమాధానం ఇస్తూనే ఉంది. టాప్ టు బాటమ్ ఈ డిజైనర్ డ్రెస్ ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తోందో అందులో అంత సౌకర్యం కూడా కొట్టొచ్చినట్టే కనిపిస్తోంది. సింపుల్ డిజైన్ లో సామ్ ఎంతో ప్లెజెంట్ గా కనిపిస్తోంది. ఆ కళ్లకు రెబాన్ ధరించి సింపుల్ గా నవ్వేస్తూ ఫ్యాన్స్ గుండెల్లో నిలిచింది. మజిలీ- ఓబేబి చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్న సామ్ ప్రస్తుతం వెబ్ సిరీస్ బాటలో పయనిస్తున్న సంగతి తెలిసిందే. తదుపరి 96 రీమేక్ లో నటిస్తోంది. అటుపై నాని సరసన ఓ చిత్రంలో నటించనుందని ప్రచారమవుతోంది.
Please Read Disclaimer