సన్నజాజి నడుముపై సిగ్నేచర్ ఎవరిది?

0

సోషల్ మీడియా పుణ్యమా అని హీటెక్కించే కంటెంట్ కి కొదవేమీ లేదు. స్టార్స్ ఫొటోల కోసం వెతుక్కునే కష్టం లేకుండానే సినీ ప్రేమికులకు కావాల్సిన ఫొటోలు- వీడియోల్ని స్టార్స్ కుప్పలు తెప్పలుగా ఇన్ స్టాలో పోస్ట్ చేసి అభిమానులకు శ్రమ లేకుండా చేస్తున్నారు. కొందరు టాప్ రేంజ్ హీరోయిన్స్ .. మొహమాటం అన్నదే లేకుండా వేడెక్కించే ఫోటోషూట్లతో హల్ చల్ చేస్తున్నారు. హాట్ గాళ్స్ లో కొందరు నాటీ ఫొటోలతో ఎగ్జిబిషన్ పెట్టేస్తున్నారు. స్టార్ హీరోయిన్ కం అక్కినేని కోడలు ఇందులో ఏమాత్రం తగ్గడం లేదు.

అక్కినేని కోడలు సామ్ తానేమీ మినహాయింపు కాదన్నట్టు ఫోటోలకి పోజులిస్తూ తన అభిమానులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. నిరంతరం కొత్త ఫోటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ అన్ లిమిటెడ్ ట్రీటిస్తున్నారు.. తాజాగా సామ్(సమంత) ఇన్ స్టాలో కొన్ని ఫొటోలని పోస్ట్ చేశారు. అవి ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి. గులాబీ వర్ణం సారీలో హొయలు పోతూ మెరిసిపోతున్నసామ్ ఫోటోలు గ్లామర్ కి కొత్త డెఫినిషన్ ఇస్తున్నాయనే చెప్పాలి.

జీ సినీ అవార్డ్స్ కోసం సామ్ ప్రత్యేకంగా ఈ పింక్ సారీ- బ్లౌజ్ ని డిజైన్ చేయించుకున్నారట. రాత్రి జరిగిన ఈ అవార్డు వేడుకలో సామ్ ప్రత్యేకంగా మెరుపులు మెరిపించారు. తమిళ చిత్రం `సూపర్ డీలక్స్` కోసం బెస్ట్ యాక్టర్ గా సామ్ స్పెషల్ జ్యూరీ అవార్డుని సొంతం చేసుకున్నారు. అయితే సామ్ ఇన్ స్టాలో రకరకాల భంగిమల్లో ఫొటోలు షేర్ చేస్తే వాటికి ప్రశంసలు దక్కుతున్నాయి. సేమ్ టైమ్ కామెంట్లతోనూ విరుచుకుపడడం కనిపిస్తోంది. ఇంత హాట్ పోజిచ్చావ్ అని కొంత మంది కామెంట్లు విసిరేస్తుంటే అక్కినేని డైహార్డ్ ఫ్యాన్స్ మాత్రం రోజు రోజుకి మరీ ఇంత ఇదిగానా? అంటూ కామెంట్ చేస్తున్నారు. కొందరైతే ఆ నడుముపై సిగ్నేచర్ ఎవరిది.. చైతూ సిగ్నేచర్ అదిరిందిలే అనేస్తున్నారు.
Please Read Disclaimer