రియాలిటీలోనూ మనసున్న మహారాణి

0

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా తనదైన మార్కుని చూపిస్తూనే నిజ జీవితంలోనూ మనసున్న మారాణి అనిపించుకుంటోంది అక్కినేని కోడలు సమంత. సామాజిక సేవల్లో ఏ ఇతర నాయికతో పోల్చినా సమంత ది బెస్ట్ అన్న మంచి పేరు తెచ్చుకుంది. ఓవైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా వుంటూనే సమాజ సేవ కోసం విరివిగా సమయం వెచ్చిస్తోంది. ఆపన్నులకు నేనున్నా అంటూ అండగా నిలుస్తోంది. ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో ఓ స్వచ్ఛంద సేవా సంస్థని రన్ చేస్తూ.. ఈ సంస్థ ద్వారా ఎంతో మందికి సహాయాన్ని చేస్తోంది సమంత.

తాజాగా గుండె జబ్బుతో బాధపడుతున్న పలువురు చిన్నారులకు ఉచిత ఆపరేషన్ లు చేయించి శహభాష్ అనిపించింది. ఆంధ్రా హాస్పిటల్స్ సహాయంతో బాధిత చిన్నారులకు మెరుగైన వైద్యసేవల్ని అందించింది. ఈ సందర్భంగా సమంత పెట్టిన పోస్ట్ హృదయాల్ని టచ్ చేసింది. బోసి నవ్వుల పిల్లల్ని అక్కున చేర్చుకుని చిరునవ్వులు చిందిస్తున్న సామ్ ఫొటోలు ఇన్ స్టాలో వైరల్ అవుతున్నాయి. `క్లిష్టమైన గుండె జబ్బుతో పోరాడి ప్రస్తుతం ఫిట్ గా వున్న పిల్లలతో వున్నందుకు చాలా సంతోషంగా వుంది. ప్రత్యూష ఫౌండేషన్ బలమైన.. లోతైన సమస్యలు తెలుసుకోవడానికి నాకు సహాయపడుతోంది. మీకు తెలుసా? ఆరోగ్యంగా కనిపించే 100 మంది పిల్లల్లో ఒక్కరు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని? అలాంటి వారిని ముందుగా గుర్తించడం వల్ల చికిత్సను అందించడం సులువు అవుతుంది. పిల్లలు పుట్టిన సమయంలో ఎలాంటి ఆక్సిజన్ ని పొందారు అన్నది తెలుసుకోగలిగితే అది మాకు సాధ్యమవుతుంది.

గర్భధారణ సమయంలో ప్రతి తల్లి తప్పకుండా తన పోషకాహారాన్ని చెక్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే పిల్లల హృదయం ఎంత వరకు ఎలా వృద్ధి చెందిందో తెలుసుకోవచ్చు. పిల్లల్లో గుండె సమస్యల యోక్క సాధారణ లక్షణాలు తెలియాలి.. అంటూ సమంత పిల్లలపై తీసుకుంటున్నజాగ్రత్తల్ని వ్యక్తం చేస్తున్న తీరుపై ఇన్ స్టా లో ప్రశంసలు కురుస్తున్నాయి.
Please Read Disclaimer