సమంతా చిన్నితెర వైపు చూస్తోందా ?

0

ఏమో తన మాటలు వింటే అదే అనిపిస్తోంది. ఇటీవలి కాలంలో వెబ్ సిరీస్ లకు విపరీతమైన ఆదరణ దక్కుతోంది. తెలుగులో ఈ ట్రెండ్ కొంత స్లోగా ఉంది కానీ హిందీలో అక్షయ్ కుమార్ సైఫ్ అలీ ఖాన్ లాంటి హీరోలకు సినిమాకు మించి రెమ్యునరేషన్ ఇచ్చి వీటిలో నటింపజేస్తున్నారు. ఫలితాలు కూడా అలాగే వస్తున్నాయి. ఆమధ్య అమెజాన్ ప్రైమ్ తెలుగులో జగపతిబాబు కీలక పాత్రలో పేరున్న టాలీవుడ్ స్టార్ క్యాస్టింగ్ తో గ్యాంగ్ స్టర్స్ అనే సిరీస్ విడుదల చేసింది కానీ ఇక్కడ పబ్లిక్ కి పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల అంతగా వర్క్ అవుట్ కాలేదు. అయినా అడపాదడపా ఇలాంటివి వస్తూనే ఉన్నాయి.

తాజాగా సమంతా కూడా ఇదే వరసలో వచ్చేలా ఉంది. సోషల్ మీడియాలో ఇటీవల దీనికి సంబంధించి ఓ అభిమాని ప్రశ్న అడిగినప్పుడు నో అని చెప్పని సామ్ ఇండైరెక్ట్ గా చేయబోతున్నానని ఒప్పుకున్నట్టే అనుకోవచ్చు. ఇదీ అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తుందని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని అది ఓకే అయితే అప్పుడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

నిజంగా సమంతా వెబ్ సిరీస్ చేస్తే మంచిదే. ప్రస్తుతం ఓ బేబీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సామ్ శర్వానంద్ పూర్తిగా కోలుకున్నాక 96 తెలుగు రీమేక్ లో పాల్గొనాల్సి ఉంది. అంతకన్నా ముందు తను కనిపించేది స్పెషల్ రోల్ చేసిన మన్మథుడు 2లోనే. వేరే ఏ కమిట్ మెంట్స్ ఇంకా ఒప్పుకోలేదు. అన్ని పెండింగ్ దశలో ఉన్నాయి. విమెన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ కు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గా నిలుస్తున్న సమంతా ఇక వెబ్ సిరీస్ లకూ వస్తే అభిమానులకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది
Please Read Disclaimer