సామ్ కోరి ఇరుక్కుందా ?

0

కబీర్ సింగ్ ప్రమోషన్ ఇంటర్వ్యూలో దర్శకుడు సందీప్ వంగా మాట్లాడుతూ చాచి కొట్టుకునేంత స్వేచ్ఛ లేకపోతే అదేమీ ప్రేమ అనడం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రేమంటే కొట్టడం కాదు అనే అర్థం వచ్చేలా సమంతా ట్వీట్ చేయడం కొత్త చర్చకు దారి తీసింది. ఇదే అదునుగా అర్జున్ రెడ్డి టైంలో సామ్ ఆ సినిమాను మెచ్చుకుంటూ పెట్టిన ట్వీట్ తాలుకు స్క్రీన్ షాట్లు బయటికి తీసి ఓ అభిమాని దీన్నేమంటారు అని ప్రశ్నించడం దానికి ధీటుగా సమంత సినిమా వేరు ఒక కామెంట్ మీద అభిప్రాయం వేరు అని సమాధానం ఇచ్చేసింది.

అయితే ఇది ఇక్కడితో ఆగలేదు. షాహిద్ కపూర్ పాత్ర కియారా అద్వానీని కొట్టడమే తప్పు అని మీకు అనిపిస్తే మరి రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ ను పోలీసులు తీసుకెళ్ళేటప్పుడు రామలక్ష్మిగా చెంప దెబ్బ తిన్నది కథ ప్రకారం ప్రేమతోనా లేక ఇంకో ఉద్దేశంతోనా అని మరో నెటిజెన్ లాజిక్ తీశాడు. నిజం చెప్పాలంటే ఇక్కడ సామ్ స్ట్రక్ అయ్యింది. కబీర్ సింగ్ లో చూపించింది నిజం కాదు సినిమానే. రంగస్థలంలో సన్నివేశం కూడా కల్పితమే. అలాంటప్పుడు సందీప్ చెప్పింది కబీర్ సింగ్ విషయంలో తప్పయినప్పుడు తాను చేసిన సన్నివేశం కూడా కరెక్ట్ కాదు అని ఒప్పుకొవాలి సామ్. కానీ ఇంకా రెస్పాన్స్ అయితే రాలేదు.

ఇదే విషయంలో సామ్ బెస్ట్ ఫ్రెండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి సైతం సై అంటే సై అంటూ బదులు ఇవ్వడం టాపిక్ ని ఇంకా హాట్ గా మార్చింది. గతంలోనూ సామ్ 1 నేనొక్కడినే టైంలో ఓ పాట మీద అభ్యంతరం చెబితే అదే తరహా సీన్ ని మజిలీలో చేసినప్పుడు ప్రిన్స్ ఫ్యాన్స్ నిలదీయడం వైరల్ అయ్యింది. ఏది ఏమైనా తమకు సంబంధం లేని సినిమాల విషయాల్లో వెళ్లడం తప్పేమి కాదు కానీ నెటిజెన్ల కౌంటర్లకు సిద్ధ పడినప్పుడే వివాదం ముదరకుండా కంట్రోల్ చేయొచ్చు. సామ్ ఏ ఉద్దేశంతో చేసినా పాపం రివర్స్ టార్గెట్ కావడం గమనార్హం
Please Read Disclaimer