వీడియో : సమంత సూపర్బ్ సాహసం

0

హీరోలైనా హీరోయిన్స్ అయినా తమ ఫిట్ నెస్ ను కాపాడుకునేందుకు చాలా కష్టపడుతూ ఉంటారు. తక్కువ తింటూ ఎక్కువ జిమ్ చేయడం వల్లే వారు ఫిట్ గా ఉండటంతో పాటు మంచి బాడీని కలిగి ఉంటారు. వెండి తెరపై చాలా సుకుమారంగా కనిపించే హీరోయిన్స్ కూడా జిమ్ లో చాలా కష్టపడుతూ ఉంటారు. అలా జిమ్ లో వారు కష్టపడకుంటే వెండి తెరపై వారు అందంగా కనిపించరు. ప్రతి హీరోయిన్ కూడా రోజులో కొంత సమయం జిమ్ కు కేటాయించాల్సిందే. ఇక హీరోయిన్ సమంత ఇతర హీరోయిన్స్ తో పోల్చితే ఇంకాస్త ఎక్కువగా వర్కౌట్స్ చేస్తుందనే అనిపిస్తుంది.

సమంత అక్కినేని గతంలో ఆమె జిమ్ వీడియోలను పలు పోస్ట్ చేసింది. అయితే అయితే తాజాగా ఈసారి ఆమె పోస్ట్ చేసిన వీడియో అందరిని ఆశ్చర్య పర్చుతోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేసిన వీడియో ఆమె కష్టంను అందరి కళ్ల ముందుకు తీసుకు వచ్చింది. మామూలుగా ఒక కర్రను ఆధారం చేసుకుని వేలాడటం చాలా కష్టం. అలాంటిది ఆ కర్రలను పట్టుకుని పైకి ఎగబ్రాకడం అంటే అది మరీ ఎక్కువ కష్టం. అలాంటిది సమంత ఎంతో ఈజీగా ఆ ఫీట్ ను చేసింది. హీరోలు సైతం అంత సులభంగా ఈ ఫీట్ ను చేయలేక పోవచ్చు. చేతుల్లో గట్టి పట్టు ఉండటంతో పాటు పట్టుదల ఉంటేనే ఇది చేయడం సాధ్యం అవుతుంది. స్పీడ్ గా పైకి ఎగబాకి అలసి పోయి దూకేయకుండా మళ్లీ చేతులతో మెల్లగా దిగడం అద్బుతం అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.

నిన్న సాయంత్రం సమంత ఈ వీడియోను పోస్ట్ చేసింది. కేవలం 12 గంటల లోపులో ఏకంగా 1.3 మిలియన్ల మంది చూశారు. సమంత పట్టుదలకు అంతా ఫిదా అవుతున్నారు. సమంత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది మజిలీ మరియు ఓ బేబీ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను దక్కించుకుంది. ప్రస్తుతం ఒక హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆ హిందీ వెబ్ సిరీస్ తెలుగు మరియు తమిళంలో కూడా డబ్ కాబోతుంది. ఇక సినిమాల విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

 

View this post on Instagram

 

Never be afraid to try new things .. you will be surprised at what you’re capable of .. loving parkour @abhinavparkour #mightymouse

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on
Please Read Disclaimer