అతడి అభిమానంకు సామ్ ఫిదా.. నెటిజన్స్ ఫైర్

0

ఇటీవల అక్కినేని నాగచైతన్య తన పుట్టిన రోజును జరుపుకున్న విషయం తెల్సిందే. హీరోల పుట్టిన రోజులను వారి కంటే వారి అభిమానులు గ్రాండ్ గా నిర్వహించే రోజులు. నాగచైతన్య బర్త్ డే ను కూడా అక్కినేని అభిమానులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఫ్యాన్స్ కేక్స్ కట్ చేయడం.. దానాలు చేయడం.. ధర్మాలు చేయడం.. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేయడం చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. ఇక మరి కొందరు ఆలయాలకు వెళ్లి తమ అభిమాన హీరోకు మంచి జరగాలని పూజలు కూడా చేయిస్తారు.

కాని ఈ నాగచైతన్య ఫ్యాన్ మాత్రం చాలా పెద్ద సాహసం చేశాడు. చైతూ పుట్టిన రోజు సందర్బంగా సింహాచలం గుడికి వెళ్లాడు అభిమాని. అది మామూలుగా అయితే ఎవరు పట్టించుకోకపోయేవారు. అతడు మోకాళ్లతో సింహాచంల గుడి మెట్లు ఎక్కి దేవుడిని దర్శించుకున్నాడు. అతడి పేరు సాగర్.. అతడిది బొబ్బిలి. మోకాళ్లతో సింహాచలం మెట్లు ఎక్కిన అతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఆ వీడియోను సమంత షేర్ చేసింది. థ్యాంక్ యూ.. ఇదో గొప్ప విషయం.. మాటలు రావడం లేదు తప్పకుండా మీరు మమ్ములను కలవాలంటూ కోరుకుంటున్నాను అంటూ రీ ట్వీట్ చేసింది. ఆమె రీ ట్వీట్ పై కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. అభిమానులు అలా చేస్తుంటే వద్దంటూ వారించడం పోయి వారిని ప్రోత్సహించడం ఏంటీ అంటూ విమర్శిస్తున్నారు. ఇలాంటి పనులు చేయడం వల్ల మిమ్ములను కలవచ్చు అని మరికొందరు ఇలా ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటే ఎవరు రెస్పాన్సుబులిటీ అంటూ సమంతను నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
Please Read Disclaimer