2 నెలల పాపతో 6000 అడుగుల ట్రెక్కింగ్!

0

సీనియర్ హీరోయిన్ సమీరా రెడ్డి పేరు దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగు సినిమాలతో పాటుగా హిందీ సినిమాల్లో నటించిన సమీరా వివాహం తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. సమీరా మొదటి సంతానం హన్స్ అనే బాబు. రెండు నెలల క్రితం పాప పుట్టింది. ఆ పాప పేరు నైరా. రీసెంట్ గా ఈ రెండునెలల వయసున్న పాపతో కర్ణాటకలోని ఎత్తైన పర్వతంపైకి ట్రెక్కింగ్ చేసింది.

ఈ విషయాన్ని తన ఇన్స్టా ఖాతా ద్వారా నెటిజన్లతో పంచుకోవడంతో సమీరాను చాలామంది అభినందనలతో ముంచెత్తారు. డెలివరీ తర్వాత చాలామంది స్త్రీలు డిప్రెషన్ తో ఇబ్బంది పడతారు. కానీ సమీరా ఇలా తన పాపను విడిచిపెట్టకుండా ట్రెక్కింగ్ చేయడం.. పైగా మార్గం మధ్యలో పాపకు పాలిస్తూ తన ట్రెక్కింగ్ ను కొనసాగించడంపై ఎంతో మంది మహిళలు సమీరాపై ప్రశంసలు కురిపించారు. సమీరా ట్రెక్కింగ్ చేసిన పర్వతమేమీ చిన్నది కాదు… 6332 అడుగుల ఎత్తు ఉండే ముళ్ళయానగిరి. ఈ ట్రెక్కింగ్ చేసే సమయంలో తీసిన వీడియోను కూడా సమీరా షేర్ చేసింది. తనకు ఐదు కేజీల లగేజ్ ఎక్కువ అంటూ.. తన ముద్దులపాపను ఉద్దేశించి క్యాప్షన్ లో వెల్లడించింది. అయితే పర్వతం అధిరోహించే సమయంలో ఊపిరి అందనట్టు అనిపించిన సమయంలో ఆగాల్సి వచ్చిందని కూడా చెప్పింది.

సమీరా తన పాపతో ట్రెక్కింగ్ చేసిన సంగతి వెల్లడించిన తర్వాత ఎంతోమంది మహిళలను తమకు ప్రేరణనిచ్చావంటూ మెసేజులు పెట్టారట. ఇలాంటి రెస్పాన్స్ చూసి ఎంతో థ్రిల్లయ్యానని సమీరా వెల్లడించింది. ఇప్పుడు మోడరన్ మామ్ గా అందరి చేత పిలిపించుకుంటున్న సమీరా ప్రెగ్నెన్సీ సమయంలో అండర్ వాటర్ ఫోటో షూట్ లో పాల్గొని సంచలనం సృష్టించింది. ఇప్పుడేమో పాపను తగిలించుకుని ట్రెక్కింగ్ చేసింది.. ఇలా ప్రతి సందర్భంలోనూ ఈ జెనరేషన్ మదర్ అని ప్రూవ్ చేస్తోంది సమీరా.
Please Read Disclaimer