కూతురి పేరు వెల్లడించిన హీరోయిన్

0

మాజీ హీరోయిన్ సమీరా రెడ్డి ఈమధ్యనే ఒక పండంటి పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాపకు పేరు పెట్టిన విషయాన్ని సమీరా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి “వార్దే కుటుంబం లోనికి చిన్న అమ్మాయిని ఆహ్వానిస్తున్నాం.. బేబీ గర్ల్ ‘నైరా'(Nyra)” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

సమీరా రెడ్డి 2014 లో ముంబైలోని వ్యాపారవేత్త అక్షయ్ వార్దే ను వివాహం చేసుకుంది. ఈ జంటకు 2015 లో హన్స్ అనే బాబు పుట్టాడు. ఇప్పుడు ఈ నైరా పాప రెండవ సంతానం. నైరా రాకతో సమీరా రెడ్డి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. అందుకే తన ఇన్స్టా పోస్ట్ ఫోటోలు కొడుకు హన్స్ తో కలిసి చిరునవ్వులు చిందిస్తూ ‘NYRA’ అనే పేరును రాసి ఉన్న ఒక పేపర్ ను పట్టుకొని పోజిచ్చారు.

ప్రస్తుతం సమీరా సినిమాలకు దూరంగా ఉంది కానీ పదిహేనేళ్ళ క్రితం సమీరా బాలీవుడ్.. టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులలో నటించింది. తెలుగులో ఎన్టీఆర్ తో ‘నరసింహుడు’.. ‘అశోక్’.. చిరంజీవితో ‘జై చిరంజీవా’ చిత్రాలలో నటించింది. బాలీవుడ్ లో దాదాపు పదిహేను సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
Please Read Disclaimer