రెడ్డి గారి ముఖంలో నవ్వుల్ పువ్వుల్!

0

తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన కథానాయిక సమీరా రెడ్డి. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగాస్టార్ చిరంజీవి సరసన కథానాయికగా నటించారు. అటుపై బాలీవుడ్ లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి అక్కడే కెరీర్ ని కొనసాగించారు. 2012లో తేజ్ అనే బాలీవుడ్ సినిమాలో నటించారు. ఆ తర్వాత కెరీర్ కి బ్రేక్ నిచ్చి 2014లో బిజినెస్ మేన్ అక్షయ్ వార్ధేని పెళ్లాడారు. 2014లో ఈ జంటకు ఒక మగబిడ్డ జన్మించాడు. హన్స్ వార్దే అతడి పేరు. ఇటీవలే రెండో బిడ్డకు సమీరారెడ్డి జన్మనిచ్చారు. అనంతరం కొన్ని ఫోటోల్ని సమీరా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ బుధవారం సాయంత్రం గోవాలో బేబి షోవర్ కార్యక్రమం జరిగింది. ఆ వేడుకకు సంబంధించి కొన్ని ఫోటోల్ని సమీరారెడ్డి సమాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు షేర్ చేశారు. ఈ ఫోటోల్లో పసుపు వర్ణం చీరలో సమీరారెడ్డి ఎంతో అందంగా నవ్వుతూ ఫోజిచ్చారు. ఆ ఫోటోని అభిమానులు జోరుగా షేర్ చేస్తున్నారు. బీచ్ సొగసుల గోవాలో జరిగిన ఈ వేడుకలో సమీరారెడ్డి బంధుమిత్రులు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

బేబి షోవర్ ఫోటోల్ని షేర్ చేసిన సమీరా వాటికి ఓ ఆసక్తికర వ్యాఖ్యను జోడించారు. “ఈ జీవితానికి సరిపడా మనస్ఫూర్తిగా నవ్వేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. దేవుడి ఆశీస్సులు నాతో ఉన్నాయి“ అని ఆనందం వ్యక్తం చేశారు. అన్నట్టు ఇంతకుముందు ప్రసవానంతరం బరువు పెరిగిన సమీరారెడ్డి తిరిగి పాత రూపానికి మారేందుకు చాలానే శ్రమించారు. పెరిగిన బరువుతో తనని తాను ఊహించుకోలేకపోయానని మదనపడి అటుపై ఎంతో హార్డ్ వర్క్ తో తిరిగి పాత రూపానికి షిఫ్టయ్యి ఇప్పుడు తిరిగి ఓ బిడ్డకు జన్మనివ్వడం విశేషం. అయితే ఈసారి మాత్రం స్లిమ్ లుక్ తోనే కనిపించడం బిగ్ షాక్ అనే చెప్పాలి. అందుకోసం నిరంతరం యోగా.. ధ్యానం చేశానని సమీరా చెబుతున్నారు. రెడ్డిగారి ముఖంలో నవ్వుల్ పువ్వుల్ ఆకట్టుకున్నాయి ఈవెంట్లో. పెళ్లి తర్వాత హ్యాపీ లైఫ్ కి సింబాలిక్ ఈ నవ్వులు అనే చెప్పాలి.
Please Read Disclaimer