గర్భిణుల ఆత్మన్యూనతపై సమీరా క్లాస్

0

సమీరా రెడ్డి .. పరిచయం అవసరం లేని పేరు ఇది. బాలీవుడ్ లో స్థిరపడిన తెలుగమ్మాయిగా.. తారక్ ఫేవరెట్ నాయికగానూ మన వాళ్లు ఇట్టే గుర్తు పట్టేస్తారు. సమీరా రెడ్డి అక్షయ్ వార్ధే అనే బిజినెస్ మేన్ ని 2014లో పెళ్లాడారు. ఆ తర్వాత 2015లో ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఇటీవలే మరో కిడ్ కి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరు పిల్లలకు తల్లిగా సమీరా తన అనుభవాల్ని సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేసుకుంటున్నారు. `ఇంపెర్ఫెక్ట్ లీ పెర్ఫెక్ట్` అనే హ్యాష్ ట్యాగ్ తో బిడ్డను కనే తల్లులందరికీ అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

బిడ్డకు జన్మనివ్వక ముందు.. జన్మనిచ్చాక తల్లి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? అనే విషయాలపై సమీరా అవగాహనా తరగతులు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇటీవలే రెండో బిడ్డకు జన్మనిచ్చిన సమీరా రెడ్డి ఆపరేషన్ తర్వాత సి-సెక్షన్ (పొట్ట దిగువ భాగం) బాధల్ని విడమర్చి చెప్పారు. ఆ బాధ తాళడం అంత సులువు కాదని ఆమె తన అనుభవాన్ని రివీల్ చేశారు. తొలి కాన్పు తర్వాత తాను పూర్తిగా అంద వికారంగా మారిపోయానని దానివల్ల అంతర్గతంగా న్యూనతా భావానికి గురై బాగా బరువు పెరిగానని తెలిపారు.

హార్మోనల్ గా ఛాలెంజెస్ ని ఎదుర్కొంటున్నా. అన్నిటినీ ఛాలెంజింగ్ గా తీసుకునేందుకు సమయం పడుతుందని వెల్లడించారు. కాన్పు తర్వాత మన రూపం ఎలా మారినా మనల్ని మనం అంగీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. నేను తొలి కాన్పు సమయంలో 105 కేజీల బరువు పెరిగాను. అంద వికారంగా మారాను. అది జీర్ణించుకోవడానికే కష్టంగా ఉండేది.. అని వెల్లడించారు. రెండో కాన్పు సమయానికి దీనిపై అవగాహన వచ్చిందని సమీరా తెలిపారు. తొలి కాన్పు తర్వాత మూడీగా ఉండడం వల్ల రెండ కాన్పు ఆలస్యమైందని కూడా సమీరా వెల్లడించారు. ఈ సమస్యల నుంచి గర్భిణులు బయటపడాలంటే ముందే అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సమీరా తన ఇద్దరు చిన్నారులతో ఉన్నప్పటి లేటెస్ట్ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Please Read Disclaimer