బ్రెస్ట్ ఫీడింగ్ పై సమీరా ఉద్వేగం

0

కథానాయిక సమీరా రెడ్డి ఇటీవలే రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. నెలలు నిండిన తర్వాత ప్రసవానికి ముందు ఫోటోషూట్ తో అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యారు. నెటిజనుల నుంచి ట్రోల్స్ ఎదురైనా ఈ ప్రయత్నాన్ని ప్రశంసించిన వాళ్లు కూడా ఉన్నారు. తనకు బిడ్డ జన్మించాక అనుభవాల్ని వెల్లడిస్తానని ముందే అభిమానులకు ప్రామిస్ చేసిన సమీరా.. ప్రతిరోజు ఆ విషయాల్ని సామాజిక మాధ్యమాల్లో చెబుతున్నారు. తొలిగా తన బిడ్డ ఫోటోల్ని అభిమానులకు షేర్ చేశారు. ప్రసవానంతరం తన అనుభవాల్ని ఎంతో ఎమోషనల్ గా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు.

తాజాగా మరో ఫోటోని సమీరా రెడ్డి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి ఎంతో ఎమోషనల్ గా వ్యాఖ్యను జోడించారు. ఆ ఫోటోలో సమీరా బాగా అలసి సొలసి కనిపిస్తున్నారు. పదకొండు రోజుల తర్వాత తన అనుభవం ఎలా ఉందో వెల్లడించారు. ఆ ఫోటోని షేర్ చేసి తన ఫాలోవర్స్ కి ఒక చక్కని సందేశం ఇచ్చారు. `బిడ్డకు పాలిచ్చే అమ్మ`ను జడ్జ్ చేయొద్దని సూచిస్తూ.. బిడ్డను సాకే అమ్మను అలా అని ఇలా అని అనడం సరికాదని అన్నారు.

బిడ్డకు పాలివ్వడం వల్ల అందం చెడిపోతుందని లేదా పాలు ఇవ్వని అమ్మకు అందం బిగి సడలదని ఇలా రకరకాలుగా బయట సమాజం మాట్లాడుకుంటుంది. అలా అని అనుకోవడం సరికాదని అర్థం వచ్చేలా సమీరా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి సమీరా రెడ్డి రెండో కాన్పు అనుభవ పాఠాలు అభిమానులకు చాలానే నేర్పిస్తున్నాయన్నమాట.