సమీరారెడ్డి ‘ఫ్లిప్ ద స్విచ్’ ఛాలెంజ్

0

బాలీవుడ్.. టాలీవుడ్ ల్లో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకోవడంతో పాటు సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న సమీరా రెడ్డి ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరం అయ్యి వైవాహిక జీవితాన్ని గడుపుతూ తల్లిగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. సినిమాలకు దూరం అయినా కూడా జనాలకు మాత్రం ఆమె ఎప్పుడు దగ్గరే ఉంటుంది. సోషల్ మీడియాలోని పలు ప్లాట్ ఫామ్ ల ద్వారా ఆమె తన ఫాలోవర్స్ ను ఎంటర్ టైన్.. ఎడ్యుకేట్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.

గర్బవతిగా ఉన్న సమయం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. పిల్లలు పుట్టిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేస్తూనే ఉంది. ఇక ఈ అమ్మడు టిక్ టాక్ లో కూడా వీడియోలు చేస్తూ తన ఫాలోవర్స్ కు ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తుంది. ఇక టిక్ టాక్ లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఫ్లిప్ ద స్విచ్ ఛాలెంజ్ ను ఈ అమ్మడు స్వీకరించింది.

హాలీవుడ్ నుండి గల్లీ వరకు ప్రస్తుతం ఫ్లిప్ ద స్విచ్ ఛాలెంజ్ ను చేస్తున్నారు. ఈ ఛాలెంజ్ లో ఇద్దరు ఉంటారు. ఇద్దరిలో ఒకరు డాన్స్ వేస్తూ ఉంటే మరొకరు అందం ముందు కెమెరా పట్టుకుని ఉంటారు. పాట మద్యలో హఠాత్తుగా కెమెరా పట్టుకున్న వారు డాన్స్ చేస్తూ ఉంటారు.. డాన్స్ చేసే వారు కెమెరా పట్టుకుని ఉంటారు. డ్రస్ లు కూడా మారుతాయి. తన అత్తగారితో కలిసి సమీరా రెడ్డి ఈ ఛాలెంజ్ చేసింది. సూపర్ పర్ఫెక్ట్ గా వచ్చిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

Flip the switch . #motherinlaw #indian #edition @manjrivarde 🥳#takefunseriously #thisishowwedoit #fliptheswitchchallenge 🤣

A post shared by Sameera Reddy (@reddysameera) on
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-