బర్నింగ్ స్టార్ కి తప్పిన ప్రమాదం!

0

టాలీవుడ్ లో సెలబ్రిటీల వరుస యాక్సిడెంట్స్ భయాందోళనకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే నటుడు రాజశేఖర్ పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఆయన ప్రయాణించిన కారు రోడ్డు పై మూడు పల్టీలు కొట్టడంతో కార్ ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. అదృష్టవశాత్తు కార్ బెలూన్స్ ఓపెనవ్వడంతో ఆయన చిన్న చిన్న గాయాలతో భయటపడ్డాడు. ఆ సంఘటన మరువకే ముందే మరో నటుడి కారు ప్రమాదం టాలీవుడ్ లో సంచలనమైంది.

బర్నింగ్ స్టార్ గా టాలీవుడ్ లో పాపులరైన సంపూర్ణేష్ బాబు కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఆయన ప్రయాణిస్తోన్న కారుని ఆర్టీసి బస్సు సిద్దిపేట వద్ద వెనుక నుంచి ఢీ కొట్టింది. సిద్దిపేట కొత్త బస్టాండ్ వద్ద ఈ ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో కారులో సంపూ తో పాటుగా ఆయన భార్య పిల్లలు ఉన్నారు. ప్రమాదంలో సంపూర్ణేష్ బాబుకి.. ఆయన భార్యకి – కుమార్తెకి స్వల్పగాయాలయ్యాయి.

ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని సంపూ ఫ్యామిలీని ఆసుపత్రికి తరలించారు. పోలీసుకులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలా వరుసగా కారు సెలబ్రిటీలకు కార్ ప్రమాదాలు జరుగుతుండడం అభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తోంది.
Please Read Disclaimer