వీడియో: సంపూ చింపేశాడుగా!

0

ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా తన టాలెంట్ ని నమ్ముకుని కమెడియన్ గా సోలో హీరోగా తన ఉనికిని చాటుకున్న సంపూర్ణేష్ బాబు కొత్త సినిమా కొబ్బరి మట్ట వచ్చే నెల 10న విడుదల కానుంది. ఇప్పటికే టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా సంపూ చెప్పిన నాన్ స్టాప్ డైలాగ్ తో ఉన్న వీడియో ఒకటి రిలీజ్ చేసింది యూనిట్. విశేషం ఏంటంటే ఇందులో సంపూ ఏకంగా 3 నిమిషాల 27 సెకండ్ల పాటు గుక్క తిప్పుకోకుండా ఏకబికిన డైలాగ్ చెప్పడం.

సినిమా కథ ప్రకారం పెదరాయుడు చినరాయుడు తర్వాత మూడో తరం వారసుడిగా ఆండ్రాయిడు పేరుతో ఎంట్రీ ఇచ్చే సందర్భంలో సంపూ ఇది చెబుతాడన్న మాట. తానెందుకు వచ్చింది తనలో ఉన్నదేంటి అని చెబుతూనే టాలీవుడ్ స్టార్ హీరోల ఇంటి పేర్లను వాడుకోవడంతో సహా సంపూ తనదైన మార్కు చూపించాడు. సాధారణంగా ఇంత పెద్ద డైలాగ్ ని సింగల్ టేక్ లో తీయడం కష్టం.

గతంలో దానవీర శూరకర్ణలో ఇలాంటి సీన్ ఉన్నప్పటికీ అది షాట్స్ ని కట్ చేసి గ్యాప్ తో తీసినది. నరసింహుడు-రాఖీలో జూనియర్ ఎన్టీఆర్ చేశాడు కానీ వాటి నిడివి రెండు నిమిషాల లోపే. అందుకే ఇప్పుడు సంపూ చేసింది వరల్డ్ రికార్డు అని చెబుతోంది యూనిట్. కామెడీగా అనిపించినా చాలా క్లిష్టమైన పదాలను ఉపయోగించి కూర్చిన తీరు బాగుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వైరల్ గా మారింది. సంపూకి నెటిజెన్ల నుంచి సూపర్ రెస్పాన్స్ దక్కుతోంది. బజ్ కాస్త తక్కువగా ఉన్న టైంలో ఈ వీడియోతో కొబ్బరిమట్ట అంచనాలు పెంచేసుకుందనే చెప్పాలి.
Please Read Disclaimer