వైకుంఠపురం దారి మార్చే పాత్ర ఆయనది

0

అల్లు అర్జున్.. త్రివిక్రమ్ ల కాంబోలో రూపొందిన అల వైకుంఠపురంలో సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రం ట్రైలర్ నిన్న మ్యూజికల్ నైట్ వేడుకలో విడుదల చేయడం జరిగింది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. టీజర్ లోనే తమిళ నటుడు సముద్రఖని ని చూపించిన దర్శకుడు త్రివిక్రమ్ ట్రైలర్ లో ఆయన పాత్రను మరింత క్లారిటీ ఇస్తూ చూపించాడు. చాలా విభిన్నమైన పాత్రలో సముద్రఖని కనిపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.

సినిమా కథలో కీలక ట్విస్ట్ కు ఈయన పాత్ర కారణం అవుతుందని.. ఆయన బాడీ లాంగ్వేజ్ మరియు మాట తీరు చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఆ పాత్రకు ఏరికోరి మరీ దర్శకుడు త్రివిక్రమ్ విలక్షణ నటుడు అయిన సముద్రఖనిని తీసుకున్నాడని అంటున్నారు. అల్లు అర్జున్.. మురళి శర్మల తర్వాత సినిమా లో చాలా కీలకమైన పాత్ర ఈయనదే అంటూ టాక్ వినిపిస్తుంది. సముద్ర ఖని డైలాగ్ డెలవరీ మరియు ఫేస్ ఫీలింగ్ ఇలా అన్ని కూడా ప్రేక్షకులను పాత్రలో లీనం అయ్యేలా చేస్తాయని అంటున్నారు.

తమిళంలో స్టార్ నటుడిగా మల్టీ ట్యాలెంట్ వ్యక్తి గా పేరు దక్కించుకున్న సముద్రఖని ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవ్వడం ఖాయం. అల వైకుంఠపురంలో చిత్రంలో మాత్రమే కాకుండా జక్కన్న తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో కూడా ఈయన కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. విలక్షణ పాత్రలను తన విలక్షణ నటనతో రక్తి కట్టించడం లో ఈయన తర్వాతే మరెవ్వరైనా. అందుకే స్టార్ డైరెక్టర్స్ కీలక పాత్రల కోసం ఈయన వెంట పడుతున్నారు.
Please Read Disclaimer