నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ కి ‘ఆర్.ఆర్.ఆర్’ మేకర్స్ అంత చెల్లిస్తున్నారా…?

0

నేషనల్ అవార్డ్ విన్నర్ సముద్రఖని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ గా యాక్టర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ గా మల్టీటాలెంట్ చూపిస్తున్న సముద్రఖని తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో మొదటగా మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘శంభో శివ శంభో’లో చిన్న పాత్రలో కనిపించాడు సముద్రఖని. ఈ చిత్రం తెలుగు మరియు తమిళ వెర్షన్ లకు ఆయనే దర్శకుడు కావడం విశేషం. ఆ తర్వాత ‘రఘువరన్ B.Tech’ ‘వి ఐ పి’ చిత్రాల్లో ధనుష్ తండ్రిగా నటించి తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించాడు. ఇక ఈ ఏడాది రిలీజైన అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో అప్పలనాయుడు అనే నెగటివ్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమాలో సముద్రఖని ‘కటారి’ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ సినిమాలో కూడా నటిస్తున్నాడు. వీటితో పాటు దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలోనూ నటిస్తున్నాడు సముద్రఖని.

కాగా భారీ మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో సముద్రఖని రెమ్యూనరేషన్ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ కోసం ఈ ‘విసరణై’ యాక్టర్ కి ఏకంగా 2 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ గా ఇచ్చారట. ‘ఆర్.ఆర్.ఆర్’ కోసం బల్క్ డేట్స్ కేటాయించిన ఈ టాలెంటెడ్ యాక్టర్ కి 2 కోట్లు ఇవ్వడం న్యాయమని మేకర్స్ భావించారట. అంతేకాకుండా తమిళ్ మార్కెట్ పరంగా కూడా సముద్రఖని ‘ఆర్.ఆర్.ఆర్’కి ప్లస్ అవుతాడని చిత్ర యూనిట్ ఆలోచించిందట. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన లేనప్పటికీ సముధ్రఖని కి అంత మొత్తంలో పారితోషకం ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది. కాగా స్టార్ హీరోలు ఎన్టీఆర్ – చరణ్ నటిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ లో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ అలియా భట్ తో పాటు పలువురు హాలీవుడ్ నటీనటులు కూడా నటిస్తున్నారు.




Please Read Disclaimer