శ్రీకాకుళం యాసతో అరవ పంచె కట్టు తంబీ

0

పంచె కట్టు .. తమిళ నేటివిటీ క్యారెక్టర్లకు సముదిరకని పెట్టింది పేరు. గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో అతడు పంచె కట్టులో కనిపించాడు. ఈసారి శ్రీకాకుళం యాస మాట్లాడుతూ పంచె కట్టులో మరోసారి తెలుగు ప్రేక్షకులకు ట్రీటివ్వనున్నాడట.

అందుకు `అల వైకుంఠపురములో` వేదిక కానుంది. ప్రత్యేకించి ఈ చిత్రంలో త్రివిక్రముడు ఓ సెటప్ ని సిద్ధం చేశారట. ఇందులో సముదిరకని పాత్ర ఎలా ఉంటుంది? అంటే అతడి పాత్రకు పూర్తిగా నెగెటివ్ టచ్ ఉంటుందట. ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో అలాంటి విలన్ ని దించడం ద్వారా వెయిట్ పెంచుతున్నారని తెలిసింది. ఇందులో టబు లాంటి సీనియర్ నాయిక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుంటే నవదీప్ ఆర్య2 తరహా పాత్రలో నటిస్తున్నాడు. బన్నితో స్నేహం వల్ల ఆ పాత్రను దక్కించుకున్నాడు నవదీప్. అలాగే సుశాంత్ మరో కీలక భూమికను పోషిస్తున్నాడు. తాజాగా తమిళ నటుడు సముదిరకని పాత్రలో ఇంట్రెస్టింగ్ షేడ్ ఆకట్టుకుంటుందని రివీలైంది.
Please Read Disclaimer