మళ్లీ వైరల్ అవుతున్న సంయుక్త

0

తెలుగు సినిమా కిర్రాక్ పార్టీతో టాలీవుడ్ కు పరిచయం అయిన సంయుక్త హెగ్డే ఆ తర్వాత మళ్లీ పెద్దగా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే ఈమె కొన్ని రోజుల క్రితం బెంగళూరులో ఒక పార్క్ లో స్పోట్స్ బ్రా వేసుకుని వర్కౌట్ చేస్తూ ఉండగా కాంగ్రెస్ నాయకురాలు.. సామాజిక కార్యకర్త కవిత వచ్చి ఆమెపై దాడికి ప్రయత్నించడం ఆ సంఘటను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో దాదాపు ఆ విషయం వారం రోజుల పాటు వైరల్ అయ్యింది. కవిత చివరకు క్షమాపణ చెప్పడంతో వివాదం సర్థుమనిగింది.

ఆ సంఘటన ఇంకా మర్చి పోకుండానే మళ్లీ సంయుక్త హెగ్డే మరో వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించింది. జిమ్ లో తెగ వర్కౌట్స్ చేసే సంయుక్త హెగ్డే ఈసారి ఆమె జిమ్నా స్టిక్స్ చేస్తూ ఉన్న వీడియోను షేర్ చేసింది. మగవాళ్లకే కష్టం అయిన రివర్స్ స్వింగ్ ను సంయుక్త హెగ్డే చేసి వావ్ గ్రేట్ అనిపించుకుంది. ఇప్పుడిప్పుడే ట్రైనింగ్ అవుతున్నట్లుగా ఉన్నావు. ఖచ్చితంగా త్వరలోనే నీవు మరింత మంచి జంపింగ్స్ జిమ్నాస్టిక్ చేస్తావని ఆశిస్తున్నాం అన్నారు.

😅 Im sure the falls are funny but look at @ramesh_sensei ‘s reactions ITS GOLD 🤣🤣🤣 #clumsyme #handspring #falls

null