కవ్విస్తున్న కొంటె జాన ఎవరు?

0

సోషల్ మీడియా యుగంలో మర్చిపోయిన కథానాయికలు కూడా తిరిగి తమని తాము రీబూట్ చేసుకుంటున్నారు. పరిశ్రమలో అవకాశాల్లేకపోయినా ఫోటోషూట్లను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం ద్వారా ఇంకా తమని తాము లైవ్ లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ కోవలోనే ఇదిగో ఈ ముంబై బొమ్మ మరో ప్రయత్నం చేస్తున్నట్టుంది.

`దిక్కులు చూడకు రామయ్య` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముంబై ముద్దుగుమ్మ సనా మక్బూల్. తొలి సినిమాలో తన నటనతో ఈ అమ్మడు ఆకట్టుకుంది. అజయ్- నాగ శౌర్య హీరోలుగా నటించిన ఈ సినిమాకి క్రిటిక్స్ ప్రశంసలు దక్కాయి. సనా నటనకు పేరొచ్చింది. అటుపై పెద్ద అవకాశాలే అందుకుంది.

ది గ్రేట్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ నిర్మాణంలో తెరకెక్కిన `రంగూన్` (2017)లో ఛాన్స్ దక్కించుకుంది. గౌతమ్ కార్తిక్ హీరోగా మురుగదాస్ శిష్యుడు పెరియ స్వామి రూపొందించిన చిత్రమిది. అటుపై చెన్నయ్ మీడియాలో సనా హాట్ టాపిక్ అయ్యింది. తెలుగులోనే మామ ఓ చందమామ అనే చిత్రంలో నటించినా అంతగా గుర్తింపు అయితే రాలేదు. ఇక ఆ తర్వాత ఏమైందో సనాకి సరైన ఛాన్సులైతే లేవు. ప్రస్తుతానికి సోషల్ మీడియాల్లో సెగలు పుట్టించేస్తోంది. సనా లేటెస్టుగా 89 డిగ్రీల కోణంలో హాటెస్ట్ పిక్ ని షేర్ చేసింది. ఇది యూత్ సోషల్ మీడియాల్లో వైరల్ గా మారింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-