సెక్సీ లేడీ ఆన్ ది ఫ్లోర్

0

సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న బాలీవుడ్ బ్యూటీలలో సన సయీద్ ఒకరు. ఆమె ఎవరు అంటే పెద్ద ఇంట్రో ఇవ్వాల్సి ఉంటుంది. షారూఖ్ ఖాన్ సూపర్ హిట్ ఫిలిం ‘కుచ్ కుచ్ హోతా హై’ లో షారూఖ్ కూతురిగా నటించిన అప్పటి పాపే ఈ భామ. ఆ సినిమా విడుదలై ఇప్పటికి ఇరవై ఏళ్ళు. సన ప్రస్తుతం టవీలో పాపులర్ నటి. స్ప్లిట్స్ విల్లా … ఝలక్ దిఖ్లాజా.. నచ్ బలియే లాంటి పలు రియాలిటీ షోలలో పాల్గొంది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’.. ‘ఫగ్లీ’ లాంటి బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించింది.

ఈ భామ యోగాలో ఉండే అన్నీ ఆసనాలను అవలీలగా చేసేస్తుంది. అందుకే యమా ఫిట్టుగా.. స్లిమ్ముగా ఉంటుంది. అటు బికినీల దగ్గరనుండి.. డిజైనర్ వేర్ దుస్తులవరకూ అన్నిరకాల దుస్తులలో ఫోటోలు తీసుకోవడం వాటిని ఇన్స్టా ఖాతాలో అభిమానులతో పంచుకోవడం ఒక హాబీ. రీసెంట్ గా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు ” ప్రేమించే వారందరిపై ప్రసరించే పసుపు రంగు కాంతిని అవుదామని నేను అనుకుంటున్నా” అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చింది. మీకు అర్థం అయితే సరే అర్థం కాకపోయినా ఫరవాలేదు. మనకు అర్థం కాని విషయాలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉంటాయి. వాటిలో ఇదొకటి.

ఫోటోలో ఒక బ్యూటిఫుల్ స్లీవ్ లెస్ థై స్లిట్ గౌన్ లో పెద్ద వాల్ మిర్రర్ ముందు కూర్చుంది. చూస్తుంటే హాటు పేరంటానికి వచ్చిన బాలీవుడ్ భామామణి తరహాలో ఉంది. ఆ పోజులు మామూలుగా లేవు. అందుకే జనాలు కూడా లైక్స్ తో కామెంట్స్ తో రెచ్చిపోయారు. “సన.. ది బ్యూటిఫుల్ బేబీ”.. “ఎల్లో బటర్ ఫ్లై”.. “బ్రైట్ సన్ ఫ్లవర్”.. “సెక్సీ లేడీ ఆన్ ది ఫ్లోర్” అంటూ పొగడ్తలు కురిపించారు. ఇక సనా కొత్త సినిమాల విషయానికి వస్తే ‘స్ట్రేంజర్ గ్రూప్’ అనే బాలీవుడ్ ఫిలిం లో నటిస్తోంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home