షేక్ చేస్తున్న సనా షేక్

0

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఫేవరెట్ నటిగా ఫాతిమ సనా షేక్ బాలీవుడ్ లో వెలిగిపోయిన సంగతి తెలిసిందే. దంగల్ లాంటి సెన్సేషనల్ హిట్ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత అమీర్ ఖాన్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్`లోనూ నటించింది. ఆ క్రమంలోనే అమీర్ ఖాన్ తో సనా షేక్ ఎఫైర్ సాగిస్తోందని.. ఆ ఇద్దరి మధ్యా సాన్నిహిత్యంపై రకరకాలుగా ప్రచారం అయ్యింది. దాదాపు దశాబ్ధం కెరీర్ లో రానంత పాపులారిటీ ఈ గాసిప్ ప్రచారంతో దక్కించుకుంది.

అమీర్ తో ఎఫైర్ అంటగట్టిన మీడియాపైనా ఫాతిమా సనా షేక్ మండిపడడం సంచలనమైంది. తప్పుడు వార్తలు రాసేస్తూ.. ప్రశాంతంగా ఎలా నిద్రపోగలుగుతున్నారు? అంటూ మీడియాపైనే విరుచుకుపడింది. మీడియా అంటేనే అసహ్యంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. అమీర్ ఖన్ తో తనకున్నది స్నేహం మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది.

కత్రిన తన ఫేవరెట్ అని చెప్పే ఈ అమ్మడు తనని రెగ్యులర్ లైఫ్ లో ఇమ్మిటేట్ చేస్తుంటుంది. అంతేకాదు.. తనంత పెద్ద స్టార్ అవ్వాలనుకుని అవ్వలేపోయింది. ఇకపోతే ఈ అమ్మడికి దంగల్ తెచ్చిన పేరు కమర్షియల్ ప్రకటనల ప్రపంచంలో అవకాశాలు తెస్తోంది. తాజాగా షేన్ అండ్ ఫల్గుని పీకాక్ స్టోర్ లాంచ్ కోసం ముంబై సౌత్ లో సందడి చేసిన ఫాతిమ రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజులిచ్చింది. నిజంగానే కత్రినను మించిన హొయలు ఈ అమ్మడిలో ఉన్నా ఎందుకని అంతగా పాపులరవ్వలేకపోయింది? అన్నది తనే విశ్లేషించుకోవాలి.

ప్రస్తుతం ఈ వేడెక్కించే ఫోటోలు ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి. అన్నట్టు సనా షేక్ ఇంతకుముందు `నువ్వు నేను ఒక్కటవుదాం` అనే తెలుగు సినిమాతో తెలుగు వారికి పరిచయమైంది. అయితే అప్పటికి దంగల్ లాంటి సంచలనం తన కెరీర్ లో లేదు కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. దంగల్ కంటే ఏడాది ముందు అంటే 2015లో ఆ తెలుగు సినిమా రిలీజైంది.
Please Read Disclaimer