ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదనేశాడు!!

0

ఈ మద్య కాలంలో యంగ్ హీరోలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా పెళ్లిలు చేసేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కొందరు సందీప్ కిషన్ వంక చూస్తున్నారు. ఈయన్ను చాలా మంది పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అంటూ ప్రశ్నిస్తున్నారట. చాలా మంది కాల్స్ చేయడంతో పాటు మెసేజ్ లు చేస్తున్నారంటూ సందీప్ కిషన్ పేర్కొన్నాడు. పెళ్లి విషయంలో వారు చూపిస్తున్న ఆతృతకు ఆశ్చర్యంగా ఉందని గతంలో సందీప్ కిషన్ కామెంట్స్ చేసిన విషయం తెల్సిందే.

తాజాగా తన కొత్త సినిమా ‘వివాహ భోజనంబు’ చిత్రం ప్రీ లుక్ విడుదల సందర్బంగా మరోసారి పెళ్లి గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఈ 33 ఏళ్ల యంగ్ స్టర్ మరికొన్ని సంవత్సరాల వరకు పెళ్లి విషయమై ఆలోచించను అంటూ క్లారిటీ ఇచ్చాడు. నా పెళ్లి గురించి కొందరి బాధ ఎమోషన్ చూస్తుంటే నవ్వు వస్తుంది అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేయడంతో పాటు తన వివాహ భోజనంబు చిత్రం ప్రీ లుక్ ను షేర్ చేశాడు.

సందీప్ వ్యాఖ్యలు చూస్తుంటే మరో నాలుగు అయిదు సంవత్సరాల వరకు పెళ్లి విషయంలో మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు అనిపిస్తుంది. ఇతర హీరోల మాదిరిగా నాలుగు పదుల వయసు వచ్చే వరకు వెయిట్ చేస్తాడేమో మరి.