కబీర్ సింగ్ ఎఫెక్ట్ సల్మాన్ దాకా ?

0

అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండకు స్టార్ డం ఇవ్వడమే కాక తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్న దర్శకుడు సందీప్ వంగా హిందీ రీమేక్ కబీర్ సింగ్ తోనూ అదే ఫలితాన్ని అందుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. బాలీవుడ్ మీడియా ఎంత టార్గెట్ చేసి సినిమా మీద నెగటివ్ ప్రచారం చేసినా దాన్ని ప్రేక్షకులు పట్టించుకోకుండా బ్రహ్మరధం పట్టడం ఏకంగా వంద కోట్ల వసూళ్లు దాటేలా చేసింది.

మొదటివారం పూర్తయినా ఇంకా స్ట్రాంగ్ గా ఉన్న కబీర్ సింగ్ ఫైనల్ గా ఈ ఏడాది టాప్ 3లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది చూసిన కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్ప్పుడు చేస్తున్న సంజయ్ లీలా భన్సాలీ మూవ్ తర్వాత సందీప్ వంగాతో చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడట. టి సిరీస్ సంస్థ ఈ వ్యవహారమంతా నడుపుతున్నట్టు సమాచారం

ఇది నిజమా కదా అని తేలడానికి కొంత టైం అయితే పడుతుంది. ఒకవేళ వాస్తవమే అయితే త్వరలో తెలుగులో ఓ స్ట్రెయిట్ క్రైమ్ చేయబోతున్న సందీప్ వంగాకు ఇక్కడ చిన్న బ్రేక్ పడినట్టు అవుతుంది. మరోపక్క మహేష్ బాబుకో కథ వినిపించాలనే టాక్ ముందు నుంచీ ఉంది. ఫైనల్ గా సందీప్ ఎవరితో లాక్ అవుతాడో వేచి చూడాలి. ఒకవేళ సల్మాన్ తో ఓకే అయితే మాత్రం రేంజ్ ఎక్కడికో వెళ్తుంది. యావరేజ్ సినిమాలతోనే వందల కోట్లు రాబట్టే కండల వీరుడికి సందీప్ లాంటి కంటెంట్ తో మెప్పించే దర్శకుడు దొరికితే ఇక రచ్చ ఏ స్థాయిలో ఉంటుందో వేరే చెప్పాలా.
Please Read Disclaimer