మరిన్ని సెక్స్ సీన్స్ కావాలంటే నో చెప్పేసిన దర్శకుడు

0

రియల్ లైఫ్ ను చూపించే క్రమంలో సంప్రదాయ పద్దతుల్ని పక్కన పెట్టేయటం ఒక ఎత్తు.. రొమాంటిక్ సీన్లను దట్టించి.. వేడి పుట్టించాలనుకోవటం మరో ఎత్తు. తన అర్జున్ రెడ్డి సినిమాతో విచ్చలవిడితనంగా కనిపించే సీన్లలో అందరూ ఓకే చేసే రియల్ లైఫ్ కనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న సొసైటీలో జరిగే సంఘటల్ని గుదిగుచ్చి.. ఒకరి జీవితంగా చూపించిన సినిమానే అర్జున్ రెడ్డి. అందుకే.. ఈ తరాన్ని విపరీతంగా అట్రాక్ట్ చేసింది. అదే మూవీ హిందీలోనూ కాసుల వర్షం కురిపించి.. మస్తు కనెక్ట్ అయ్యింది.

బోలెడన్ని ముద్దు సీన్లతో అదరగొట్టేసిన అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఒక ఆసక్తికరమైన ప్రపోజల్ వచ్చింది. అందుకు ఆయన నో అని చెప్పేయటం విశేషం. ఇంతకీ అతనికి వచ్చిన ఆఫర్.. సెక్స్ కంటెంట్ మస్తు ఉండే వెబ్ సిరీస్ చేయమన్నారట. ఇటీవల లవ్ స్టోరీస్ పేరుతో లవ్ కంటే ఎక్కువగా లస్ట్ చూపించే వెబ్ సిరీస్ ఎంత విజయవంతమైందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

అదే సిరీస్ ను తెలుగులో రీమేక్ చేయాలని నిర్మాతలు అడిగితే.. అందుకు అర్జున్ రెడ్డి దర్శకుడు మాత్రం నో చెప్పేశారట. ఒరిజినల్ వెబ్ సిరీస్ లో కియారా అద్వానీ.. భూమి ఫడ్నేకర్ లాంటి స్టార్స్ నటించటమే కాదు.. బోల్డ్ సీన్లతో దుమ్ము రేపే రీతిలో రెచ్చిపోయి నటించారు. ఆ వెబ్ సిరీస్ కు మరికాస్త మసాలా దట్టించాలని నిర్మాతలు అడిగారట.

హిందీతో పోలిస్తే తెలుగులో మరింత లస్ట్ పెంచాలని అడిగిన నేపథ్యంలో ఆ ఆఫర్ కు నో చెప్పేశారట సందీప్ రెడ్డి. అలా చేయటం తనకు నచ్చలేదని.. నిజానికి తనకు లస్ట్.. సెక్స్ అనే కాన్సెప్ట్ లపై పెద్దగా ఇంట్రస్ట్ ఉండదని పేర్కొన్నారు. ఈ సిరీస్ ను తెలుగులో తరుణ్ భాస్కర్.. నందినిరెడ్డి.. సంకల్ప్ రెడ్డి లాంటి దర్శకులు చేస్తున్నారు. బోల్డ్ సీన్లు తీయటంలో మొనగాడన్న పేరున్న సందీప్ నో చెప్పేయటం ఆసక్తికరంగా మారింది.