ఎందుకు వారి లవ్వును జడ్జ్ చేస్తున్నారు?: సందీప్

0

చెంప దెబ్బకు అంత హంగామా జరుగుతుందా? ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలో శ్రీదేవిని చిరంజీవి ఒక చెంపదెబ్బ కొడతాడు. నిజానికి చెంపదెబ్బ కొట్టించుకోవడం ఏమీ రొమాంటిక్ సిట్యుయేషన్ కాదు. అయినా దాన్ని రొమాంటిక్ గా మార్చి ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ అంటూ పాటేసుకున్నారు. హిందీలో అదే పాటను ‘ధక్ ధక్ కర్నే లాగా’ అంటూ అనిల్ కపూర్.. మాథురి పాడుకున్నారు. పాత ‘ఆవారా’ సినిమాలో లెజెండ్ రాజ్ కపూర్ ఒక సీన్ లో హీరోయిన్ ను బాదిపారేస్తాడు! అయితే ఇప్పుడు చెంప దెబ్బలో వయోలెన్స్.. ఫెమినిజం..జఫ్ఫాయిజం లాంటి కాన్సెప్ట్ లు చాలా చూస్తున్నారు. సో అప్పటిలా చెంపదెబ్బలో రొమాన్స్.. లవ్ ను చూపించడం కష్టం. అందుకే ‘కబీర్ సింగ్’ దర్శకుడు సందీప్ వంగా స్లాప్ కామెంట్స్ పై పెద్ద హంగామా జరుగుతోంది.

ఇదిలా ఉంటే ఈ స్లాప్ ఎపిసోడ్ పై రీసెంట్ గా సందీప్ స్పందిస్తూ “నేను ఆ ఇంటర్వ్యూలో నా సినిమాలో హీరో ఎలా బిహేవ్ చేస్తాడో చెప్పాను. కబీర్ సింగ్ ఎలా ఫీల్ అవుతాడో అలాగే నేను ఫీల్ అవను. అతను హింసతో తన ప్రేమను వ్యక్తపరుస్తాడేమో కానీ నేను కాదు. విమర్శకులు నేను చెంపదెబ్బ కొట్టాల్సిందే.. అదే లవ్ అన్నట్టుగా అనుకుంటున్నారు. నేను చెప్పింది ఏంటంటే ఒక రిలేషన్ లో నిజాయితీ ఉన్నప్పుడు ఒక్కోసారి అది హింసాత్మక రూపం తీసుకుంటుంది. కబీర్ తన గర్ల్ ఫ్రెండ్ ప్రీతిని కొట్టడమే కాదు. ప్రీతి కూడా కబీర్ ను చెంపదెబ్బ కొడుతుంది దానిసంగతి మాట్లాడరెందుకు? వారి ప్రేమను ఎలా వ్యక్తపరుస్తారనేది వారి ఛాయిస్. మరి వారి లవ్వును ఎందుకు జడ్జ్ చేస్తున్నారు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే… ట్రూ లవ్ లో ఒక్కోసారి ఎమోషన్స్ అలా మారవచ్చు” అన్నాడు.

బాలీవుడ్ క్రిటిక్స్ సందీప్ ను టార్గెట్ చేశారు.. సందీప్ వాళ్ళకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు అనేది పక్కన పెడితే ఒకటి మాత్రం నిజం. ఇప్పుడు సందీప్ వంగా ఫుల్లుగా పాపులర్ అయ్యాడు. సందీప్ పేరు తెలియని వ్యక్తి బాలీవుడ్ లో ఎవరూ లేరు.. హిందీ ప్రేక్షకుల్లో కూడా సందీప్ పేరు మార్మోగిపోతోంది. ఈ ఊపులో బైట ప్రచారంలో ఉన్నట్టుగా సల్మాన్ ఖాన్ లాంటి హీరోతో సినిమా చేస్తే అప్పుడు ఈ క్రిటిక్స్ చల్లబడతారు. ఎందుకంటే షాహిద్ కు రూల్స్ ఉంటాయి కానీ సల్మాన్ ఖాన్ సినిమాకు ఉండవు కదా?
Please Read Disclaimer