మహేష్ కి మైత్రికి మధ్య సందీప్?

0

బాలీవుడ్ డెబ్యూతోనే రెండు వందల మార్కు సినిమా దిశగా కబీర్ సింగ్ తో పరుగులు పెట్టిస్తున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఏంటి అనే దాని గురించి ఇంకా సస్పెన్సు తొలగడం లేదు. ఒకపక్క టి సిరీస్ సల్మాన్ ఖాన్ తో ఈ డైరెక్టర్ కాంబోని సెట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నిన్న దీని గురించి మీడియాలో సైతం మంచి కవరేజ్ వచ్చింది. అధికారిక ప్రకటన రాలేదు కానీ చర్చలు జరిగిన మాట వాస్తవమేనట. అయితే సందీప్ వంగా గతంలో మైత్రి
సంస్థకు ఓ కమిట్ మెంట్ ఇచ్చాడు.

అర్జున్ రెడ్డి టైం నుంచే సందీప్ తో చేయాలని ఉత్సాహం చూపిస్తున్న మహేష్ బాబు కూడా సరైన కథ దొరికితే వెంటనే ఓకే చెప్పేందుకు రెడీగా ఉన్నాడు. కానీ సరిలేరు నీకెవ్వరు షూటింగ్ పూర్తయ్యే దాకా దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు. ఈలోగా ఇంకో హీరోతో అదే కథ లేదా వేరే స్టోరీతో మరో సినిమా చేసి పెట్టమని మైత్రి సంస్థ సందీప్ ని కోరిందట. అతను మాత్రం చేస్తే మహేష్ బాబుతోనే చేసి మైత్రి బ్యానర్ కు ఇచ్చిన కమిట్ మెంట్ పూర్తి చేస్తాను తప్ప ఇప్పుడు ఇంకో హీరోతో చేసే ఆలోచన లేదని చెప్పేశాడట.

ఒకవేళ సల్మాన్ ఖాన్ త్వరగా గ్రీన్ సిగ్నల్ ఇస్తే వచ్చే రెండు నెలల్లో షూటింగ్ మొదలుపెట్టేయొచ్చు. కాలేదు అంటే వేరే ఆప్షన్ చూసుకోవాల్సి వస్తుంది. మహేష్ ఖచ్చితంగా మాట ఇస్తే ఇంకో ఆరు నెలలు వెయిట్ చేయడం పెద్ద సమస్య కాదు. కానీ మైత్రి సంస్థ సందీప్ ని తొందరపెట్టడంతో అసలు సమస్య వస్తోంది. ఇదంతా తేలేలోపు కొంత టైం పట్టేలా ఉంది. అర్జున్ రెడ్డి తర్వాత రెండోది దాని రీమేకే హిందీలో చేసిన సందీప్ వంగా మరో తెలుగు స్ట్రెయిట్ మూవీ చేయాలనీ సినిమా ప్రేమికులు కోరుతున్నారు. ఫైనల్ గా ఏది ఫిక్స్ అవుతుందో వేచి చూడాలిPlease Read Disclaimer