సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ లో హీరో అతనేనా…?

0

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఒక్క సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు సందీప్. ఆ సినిమా ఇచ్చిన క్రేజ్ తో సందీప్ కి టాలీవుడ్ లో ఆఫర్స్ వెల్లువలా వచ్చిపడ్డాయి. అయితే సందీప్ టాలీవుడ్ హీరోలతో సినిమా కమిట్ అవకుండా బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమానే హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా సంచలనం సృష్టించాడు. ‘కబీర్ సింగ్’ భారీ బ్లాక్ బస్టర్ అవడంతో ఏకంగా బాలీవుడ్ లోనే టాప్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకడిగా మారిపోయాడు. ఈ నేపథ్యంలో సందీప్ మళ్ళీ బాలీవుడ్ హీరోతోనే తన నెక్స్ట్ సినిమాని ప్లాన్ చేసుకున్నారు.

బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ తో సందీప్ వంగా ఓ యాక్షన్ క్రైమ్ డ్రామాను ప్లాన్ చేస్తున్నాడని.. దీని కోసం ‘డెవిల్’ అనే టైటిల్ అనుకుంటున్నారని న్యూస్ వచ్చింది. అయితే కొన్ని అనుకోని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ రణ్ బీర్ తో సెట్ కాలేదని.. దీంతో సందీప్ వంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఈ స్టోరీ నారేట్ చేసాడని అనుకున్నారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని అవన్నీ పుకార్లే అని అర్థం అయింది. దీంతో సందీప్ వంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో సస్పెన్స్ అలానే కొనసాగుతూ వచ్చింది. కాగా ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం మళ్ళీ ‘డెవిల్’ ప్రాజెక్ట్ లైన్లో కి వచ్చిందట.

బాలీవుడ్ సర్కిల్స్ సమాచారం ప్రకారం సందీప్ వంగా – రణ్ బీర్ కపూర్ ల మధ్య ఈ ప్రాజెక్టుకు సంభందించిన చర్చలు జరుగుతున్నాయట. ఈ స్క్రిప్ట్ విషయంలో పాజిటివ్ గా ఉన్నారని.. దీనిపై క్లారిటీ వచ్చాక ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉందని బీ టౌన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గతంలో టీ సిరీస్ సంస్థతో సందీప్ ఓ సినిమా చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. మరి ఇప్పుడు రణ్ బీర్ కపూర్ తో సందీప్ చేయబోయే సినిమాకి వారే ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తారేమో చూడాలి. ఇక ‘కబీర్ సింగ్’ తో బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ వంగా ఈ సినిమాతో బాలీవుడ్ లో తన సక్సెస్ ట్రాక్ కొనసాగిస్తాడేమో చూడాలి.
Please Read Disclaimer