అల బాలీవుడ్ లో మ్యాజిక్ రిపీట్ అయ్యేనా?

0


మొన్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రం నాన్ బాహుబలి రికార్డును సొంతం చేసుకుని బన్నీ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ టాప్ చిత్రాల జాబితాలో నిలిచింది. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు నిర్మాత అశ్విన్ వార్దే రైట్స్ ను దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. రీమేక్ రైట్స్ కు ఆయన భారీ మొత్తంను వ్యచ్చించినట్లుగా కూడా సమాచారం అందుతోంది. ప్రస్తుతం రీమేక్ కు సంబంధించిన చర్చలు జరుపుతున్నారట.

అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసింది అశ్విన్ వార్దేనే. ఆ సినిమా భారీ లాభాలను తెచ్చి పెట్టడంతో ఇప్పుడు ఈ సినిమా రైట్స్ ను తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. అర్జున్ రెడ్డి రీమేక్ ను సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో నిర్మించిన అశ్విన్ ఇప్పుడు అల వైకుంఠపురంలో సినిమాను కూడా ఆయన దర్శకత్వంలోనే నిర్మించాలని భావిస్తున్నాడట. ఈ స్టోరీని సందీప్ అయితే బాగా డీల్ చేస్తాడని ఆయన నమ్ముతున్నాడట.

రీమేక్ రైట్స్ తీసుకున్న అశ్విన్ దర్శకుడిని ఫైనల్ అయితే చేశాడు కాని అల్లు అర్జున్ పాత్రను పోషించేందుకు ఏ బాలీవుడ్ హీరో ముందుకు వస్తాడో చూడాలి. కబీర్ సింగ్ ను షాహిద్ కపూర్ తో తెరకెక్కించారు. వైకుంఠపురంలోని బంటు పాత్రకు షాహిద్ కపూర్ సెట్ అవ్వడనిపిస్తుంది. అందుకే ఒక మంచి యాక్షన్ హీరోను పట్టుకునే పనిలో నిర్మాత అశ్విన్ ఉన్నాడట. హీరో దొరికినా తెలుగులో అల వైకుంఠపురం మ్యాజిక్ చేసి సక్సెస్ అయ్యింది. అలాంటి మ్యాజిక్ అక్కడ రిపీట్ అయ్యేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer