ఇండియా పాక్ మ్యాచ్ యాడ్ పై ఈమె ఆగ్రహం

0

ఇండియా మరియు పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మ్యాచ్ కు రంగం సిద్దం అయ్యింది. ఇండియా మరియు పాకిస్థాన్ లు మామూలుగా వన్డే సిరీస్ లలో ఆడితేనే హడావుడి భారీగా ఉంటుంది. అలాంటిది ఏకంగా వరల్డ్ కప్ లో తలబడబోతూ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్ కు ఇంకా హైప్ క్రియేట్ చేసేందుకు కొన్ని ఛాన్స్ వింత వింత యాడ్స్ ఇస్తూ ఉన్నారు.

పాకిస్థాన్ కు చెందిన ఛానెల్ ఈ మ్యాచ్ పై ఆసక్తి కలిగించేలా ఒక యాడ్ ను క్రియేట్ చేయడం జరిగింది. ఆ యాడ్ లో భారత వింగ్ కమాండర్ అభినందన్ గెటప్ లో ఒక వ్యక్తిని నటింపజేశారు. అభినందన్ గెటప్ లో ఉన్న వ్యక్తి ఇండియన్ క్రికెట్ జెర్సీ వేసుకుని ఉంటాడు. పాకిస్థాన్ కు చెందిన వారు అతడిని పట్టుకుని విచారణ పేరుతో ఇండియా టాస్ గెలిస్తే ఏం చేస్తుంది అంటూ ప్రశ్నించగా ఐయామ్ సారీ నేను అది చెప్పకూడదు. మరో ప్రశ్నగా మీ ఫైనల్ టీంలో ఎవరెవరు ఉండబోతున్నారు అంటూ ప్రశ్నించగా ఐయామ్ సారీ నేను అది చెప్పకూడదు అంటూ సమాధానం ఇస్తాడు. చివరకు టీ ఎలా ఉందని ప్రశ్నించగా చాలా బాగుంది అంటాడు. ఇక నువ్వు వెళ్లవచ్చు అనగానే కప్పు పట్టుకుని అభినందన్ గెటప్ లో ఉన్న వ్యక్తి వస్తున్న సమయంలో కప్పు అక్కడ పెట్టి వెళ్లు అంటూ అనడం తో యాడ్ పూర్తి అవుతుంది. ఈ యాడ్ కు విపరీతమైన స్పందన వస్తోంది.

పాకిస్తాన్ తో పాటు ఇండియాలో కూడా ఈ యాడ్ గురించి పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో పాకిస్తానీ కోడలు హైదరాబాదీ అమ్మాయి అయిన సానియా మీర్జా స్పందించింది. ఇది కేవలం క్రికెట్ మ్యాచ్ మాత్రమే. ఇంతకు మించి ఎక్కువ ఊహించుకోవచ్చు. ఇప్పటికే ఈ మ్యాచ్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందరికి ఆసక్తి ఉంది. దాన్ని మళ్లీ మీరు పెంచేందుకు యాడ్స్ చేసి హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు అంటూ సానియా అసహనం వ్యక్తం చేసింది. సానియా మీర్జా పోస్ట్ కు చాలా మంది మద్దతు తెలుపుతున్నారు.